Advertisement
Google Ads BL

జబర్దస్త్ స్కిట్స్ వల్లే ఇంత సక్సెస్


జబర్దస్త్ స్టార్ట్ అయినప్పుడు వేణు, ధనరాజ్, చిత్రం శ్రీను లాంటి వాళ్ళు టీమ్ ని ఫార్మ్ చేసుకుని.. వాళ్ళే స్కిట్స్ రాసుకుని, డైలాగ్స్ రాసుకుని, వాళ్ళే ఆ స్కిట్ ని డైరెక్ట్ గా రిహార్సల్ చేసుకుని అదిరిపోయే కామెడీని పండించేవారు. తర్వాత వేణు వాళ్ళు జబర్దస్త్ నుండి వెళ్ళిపోయి అడపాదడపా సినిమాల్లో కనిపించినా అంతగా ఎక్కడా పాపులర్ కాలేదు. నాగబాబుతో కలిసి అదిరింది కనబడినా అది అంతగా వేణు వాళ్ళకి పేరు తీసుకురాలేదు.

Advertisement
CJ Advs

కాని వేణు బలగం కథ తో డైరెక్టర్ గా మారడమే కాదు.. దిల్ రాజు లాంటి బడా నిర్మాత సపోర్ట్ తో దర్శకుడిగా బలంగంతో బలమైన హిట్ కొట్టాడు. అయితే తాను జబర్దస్త్ లో చేసిన స్కిట్స్, అక్కడ చేసిన స్కిట్స్ దర్శకత్వం తనకి బలగం దర్శకత్వంలో ఎంతో ఉపయోగపడింది, అలాగే అక్కడ ఉండే క్రమశిక్షణ కూడా నాకు డైరెక్షన్ కి హెల్ప్ అయ్యింది అంటూ తాజాగా వేణు సుమ అడ్డాలో చెప్పాడు.

వేణు, ప్రియదర్శి, రచ్చ రవి ఇంకా బలగం హీరోయిన్ తో కలిసి సుమ అడ్డాలో పాల్గొన్నారు. సుమ అడ్డాలో వేణు జబర్దస్త్ వలన తనకి బలగం దర్శకత్వం చెయ్యడం ఈజీ అయ్యింది అంటూ జబర్దస్త్ పై వేణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయగా.. తాను జబర్దస్త్ లో ఎలాంటి విభేదాలతో బయటికి వెళ్లలేదని, కేవలం సినిమాల్లో ఉండాలనే కోరికతో జబర్దస్థ్ ని వీడినట్లుగా బలగం ప్రమోషన్స్ లో చెప్పాడు.

Jabardasth skits are so successful:

Venu interesting comments on jabardasth
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs