Advertisement
Google Ads BL

డేట్ ఇవ్వకుండా ప్రీమియర్ ఏంటి సామి


కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన రంగమార్తాండ కి చెయ్యాల్సిన ప్రమోషన్స్ చేస్తున్నారు, అవ్వాల్సిన పబ్లిసిటీ అవుతుంది. ఆఖరికి ప్రమోషన్స్ కంప్లీట్ కూడా అయ్యాయి. కానీ రంగమార్తాండకి రిలీజ్ డేట్ మాత్రం దొరకడం లేదు. మేకర్స్ ఎందుకింతగా సినిమా రిలీజ్ చెయ్యలేకపోతున్నారో నెటిజెన్స్ కి అర్ధమవడంలేదు.. కృష్ణవంశీ ఫాన్స్ కైతే అస్సలు అర్ధం కాక జుట్టు పీక్కుంటున్నారు. అంత పెద్ద డైరెక్టర్, ఒకప్పుడు బోలెడన్ని సూపర్ హిట్ సినిమాలు చేసిన కృష్ణవంశీ సినిమాకి ఇలాంటి పరిస్థితా అని వారు జాలిపడిపోతున్నారు.

Advertisement
CJ Advs

మరి రిలీజ్ డేట్ సంగతి అలా ఉంటే.. రంగమార్తాండ కి స్పెషల్ ప్రీమియర్ పడిపోయింది. పలు వెబ్ సైట్స్ లో, సోషల్ మీడియాలో రంగమార్తాండ స్పెషల్ ప్రీమియర్ టాక్ అంటూ న్యూస్ లు వేలల్లో కనబడుతున్నాయి. కృష్ణవంశీ గారు స్పెషల్ గా ఇన్వైట్ చేస్తే రంగమార్తాండ ప్రీమియర్ కి వెళ్లిన వారిలో ఒకరు.. సినిమా చూసి ఇలా పోస్ట్ పెట్టారు.

ఒక్క ఫ్రేమ్ కూడా మన తెలుగుదనం, మిడిల్ క్లాస్ భావాల నుంచి పక్కకు వెళ్ళదు. ఫోకస్డ్ కన్సిస్టెన్సీ అని చెప్పొచ్చు..కథనుంచి డీవియేట్ కాకుండా వాళ్ళు మాట్లాడుతుంటే మనం వాళ్ళ పక్కనే కూర్చుని వింటున్నట్టు, వాళ్ళు అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతే మనం కూడా వాళ్ళతో లేచి వెళ్తున్నట్టు ఒక రకమైన ప్రపంచాన్ని సృష్టించారు!!ఆయన టేకింగ్ లో ఉండే మేజిక్ అదే ఏమో బహుశా!! మనం ఫ్రీగా వచ్చే తల్లితండ్రుల్ని, భార్యల్ని ఎంత ఈజీ గా తీసుకుంటున్నాం..అని ఒక్కసారి గట్టిగా తట్టి చెప్పారు!! మన ఆలోచనలకి ఒక కలర్ లేదా మ్యూజిక్ ఉండదు..కానీ వాటికి కలర్ అండ్ మ్యూజిక్ ఇస్తే ?? మనసు బాధగా ఉండి..ఆ బాధకి బాక్గ్రౌండ్ స్కోర్ ఉంటె ?ఆ సీన్స్ కి ఆ మ్యూజిక్ తోడయ్యి ఒక రకమైన ట్రాన్స్ లోకి పంపిస్తుంది ఈ సినిమా!! మా బాస్ పాటల్ని చూస్తే ఒక ట్రాన్స్ లోకి వెళ్తాము..ఈయన సినిమా ని ఒక సాంగ్ లాగ తీశారు!! ఎ

హాంటింగ్ మ్యూజిక్, హాంటింగ్ విసుఅల్స్, హాంటింగ్ పెరఫార్మన్సెస్ .. రమ్య కృష్ణ , శివాత్మిక అండ్ బ్రహ్మానందం... వీళ్ళ ముగ్గురి కోసం తప్పక చూడాలి ఈ సినిమా ..వీళ్ళ అభినయం నయనాందకరం..వీళ్ళు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారని గర్వం గా చెప్పుకోవచ్చు!!

ఇంటర్వెల్ లో బయటకి వచ్చి, సెకండ్ హాఫ్ కి  మళ్ళీ లోపలికి  వెళ్ళాలి అంటే భయం వేసింది..ఎందుకంటే మళ్ళీ ఏం ఆలోచింప చేయిస్తాడో, మళ్ళీ మనం ఎంత పశ్చాత్తాప పడాలో, మనల్ని మనం ఎంత సేపు చూసుకోవాలో అనే భయం పుట్టించారు!! మూవీ అయిన తరువాత ఒక చైన్జ్డ్ పర్సన్ లా బయటకి రావడం అయితే పక్కా!! అంటూ ఆయన కృష్ణవంశీ రంగమార్తాండ వీక్షించాక పెట్టిన పోస్ట్.

మరి ప్రీమియర్స్ కి సూపర్ టాక్ వస్తుంది.. ఇదే ఊపులో ఆయన సినిమాకి రిలీజ్ డేట్ కూడా ఇస్తే ప్రేక్షకులు కూడా థియేటర్స్ కి క్యూ కడతారు.

What is the premiere without giving a date?:

Rangamarthanda premier show talk
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs