Advertisement
Google Ads BL

యంగ్ హీరో మూవీపై బజ్ కనిపించడంలేదు


కృష్ణ వ్రింద విహారితో సో సో హిట్ అందుకున్న నాగ శౌర్య తదుపరి మూవీ ని శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి సినిమా చేసాడు. వచ్చే వారమే రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ చిత్రంపై ట్రేడ్ లో కానీ, ప్రేక్షకుల్లోకాని పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. అసలు ఈ చిత్రంపై సోషల్ మీడియాలోనూ ఎలాంటి బజ్ క్రియేట్ కావడమే లేదు. కొద్ది రోజులుగా హిట్ కోసం ఎదురు చూస్తున్న నాగ శౌర్యకి ఈ చిత్రం హిట్ కంపల్సరీ అనేలా ఉంది.

Advertisement
CJ Advs

గతంలో మాళవిక నాయర్ తో నాగ శౌర్య కల్యాణ వైభోగమే చిత్రం చేసాడు. ఇప్పుడు మళ్ళీ అదే హీరోయిన్ తో ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి చేసాడు. అటు చూస్తే మాళవిక నాయర్ ఫామ్ లోనే లేదు. ఇటు నాగ శౌర్య కి ప్రస్తుతం పెద్దగా సక్సెస్ లేకపోవడమే ఈ చిత్రంపై బజ్ క్రియేట్ కాకపోవడానికి కారణమనిపించేలా ఉన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై ఇంట్రెస్ట్ కలిగించేదిలా ఉంది.

మరి ఈ నాలుగు రోజులపాటు సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లి ప్రమోషన్స్ చేస్తే బజ్ క్రియేట్ అవుతుంది. లేదంటే కష్టం. మరి మేకర్స్ కూడా ఈ 4 డేస్ డిఫరెంట్ ప్రమోషన్స్ గనక ప్లాన్ చేస్తే.. సోలో గా రిలీజ్ అవుతుంది కాబట్టి సినిమా గట్టెక్కేస్తుంది. లేదంటే ఇప్పుడున్న పరిస్తితుల్లో సినిమాకి కలెక్షన్స్ రావాలంటే చాలా కష్టం.

There is no buzz on the young hero movie:

Phalana Abbayi-Phalana Ammayi without buzz
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs