సూపర్ స్టార్ రజినీకాంత్ వెంకయ్యనాయుడికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం తనకి నచ్చలేదు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. శనివారం వెంకయ్యనాయుడు, రజినీకాంత్ ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఓ ఈవెంట్ లో రజినీకాంత్ ఈ విధంగా కామెంట్స్ చెయ్యడం చర్చనీయాంశం అయ్యింది. ప్రధాని మోడీ అప్పట్లో ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడికి పదవి ఇవ్వడం వెంకయ్యకే నచ్చలేదనే టాక్ ఉంది. ఎందుకంటే ఉపరాష్ట్రపతిగా ఆయన చెయ్యాల్సింది ఏమి ఉండదు, ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరం కావాలనే ఉద్దేశ్యంతో అప్పట్లో ఆయన ఆ పదవిపై ఇష్టాన్ని చూపించలేదు అంటారు.
తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు కూడా అవే. వెంకయ్య నాయుడు గారికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం తనకి నచ్ఛలేదు, ఉపరాష్ట్రపతి హోదాలో ఆయన చెయ్యడానికి ఎలాంటి పని ఉండదు, అలా ఆ పదవి ఇచ్చి ఆయన్ని రాజకీయాలకు దూరం చెయ్యడం తనకి అస్సలు నచ్ఛలేదు, ఎందుకంటే కొన్ని రోజులు ఆయన కేంద్ర మంత్రిగా ఉండి ఉంటే బావుండేది అంటూ సంచలనంగా మాట్లాడారు. అదే ఈవెంట్ లో వెంకయ్య మట్లాడుతూ.. నేనే సూపర్ స్టార్ రజినీకాంత్ ని రాజకీయాల్లోకి రావొద్దు అని చెప్పాను, ఆరోగ్యంగా ఉండాలంటే రాజకీయాలకు దూరంగా ఉండాలని చెప్పాను.
ప్రజా సేవ చెయ్యడానికి ఇంకా ఎన్నో మార్గాలున్నాయి అని చెప్పాను. నేను రాజకీయాల్లోకి రావొద్దని ఎవరిని డిస్పాయింట్ చెయ్యడం లేదు. రాజకీయాల్లోకి యువత రావాలి. వారిలో క్రమశిక్షణ, చైతన్య, అంకిత భావం, ప్రజా సేవ చెయ్యాలనే ఆలోచన ఉండాలంటూ వెంకయ్య మాట్లాడారు.