వెంకీ F3 తర్వాత అన్న కొడుకు హీరో రానా తో కలిసి నెట్ ఫ్లిక్స్ కోసం రానా నాయుడు అనే వెబ్ సీరీస్ లో నటించారు. రానా బాహుబలితో పాన్ ఇండియా క్రేజ్ రావడంతో రానా నాయుడు వెబ్ సీరీస్ ని పాన్ ఇండియాలోని పలు భాషల్లో విడుదల చేసారు. ముఖ్యంగా హిందీ ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలా రానా నాయుడు ఉండడం తెలుగు ప్రేక్షకులకి అస్సలు రుచించలేదు. తెలుగు హీరోలై ఉండి.. ఈ సీరీస్ లో వెంకటేష్ మాట్లాడిన బూతులు ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. అబ్బాయిలు చాలామంది ఈ సీరీస్ చూసి తమ భార్య పిలల్లకి, ఇంకా చెల్లెళ్లకి కూడా ఈ సీరీస్ చూడొద్దు అంటూ చెబుతున్నారు అంటే రానా నాయుడు ఎలా ఉందో అర్ధమవుతుంది.
రానా-వెంకటేష్ యాక్టింగ్ పరంగా ఇరగదీసేసారు. కానీ.. సినిమాలో వెంకీ కేరెక్టర్ చెప్పే బూతులు వినలేక తెలుగు ప్రేక్షకులు చెవులు మూసుకుంటున్నారు. అయితే ఈ సీరీస్ లో నటించినందుకు గాను వెంకటేష్ పారితోషకంగా ఎంత తీసుకున్నారు, రానా ఎంత అందుకున్నాడనే విషయంలో సోషల్ మీడియాలో డిస్కర్షన్ జరుగుతుంది. అయితే తాజాగా వెంకటేష్ నాయుడు పాత్ర కోసం అక్షరాలా 12 కోట్లు అందుకున్నారని అంటున్నారు.
రానా పాత్ర కోసం రానా దాదాపు 8 కోట్ల పారితోషకం అందుకున్నది. తండ్రి కొడుకులుగా వెంకీ-రానా లు రానా నాయుడుతో కనిపించారు. అయితే నెట్ ఫ్లిక్స్ లో మార్చ్ 10 నుండి స్ట్రీమింగ్ లోకి వచ్చిన రానా నాయుడుపై తెలుగు ప్రేక్షకులు పెద్డవి విరుపులే కాదు.. వెంకటేష్ పై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.