పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి హీరో గా ఎంటర్ అయ్యి 27 ఏళ్ళు అయ్యింది. అయినప్పటికీ పవన్ అప్పుడేంత స్టైలిష్ గా ఉన్నారో.. ఇప్పుడూ అంతే స్టైలిష్ గా ఉన్నారు. కొద్దిరోజులుగా సాయి తేజ్ తో కలిసి చేస్తున్న PKSDT చిత్రం షూటింగ్ లో పాల్గొంటూ అటు రాజకీయాలకి విరామం ప్రకటించారు. దాదాపు 20 రోజులుగా పవన్ కళ్యాణ్ ఏ కెమెరాకి దొరకలేదు. పవన్-సాయి తేజ్ మూవీ ఓపెనింగ్ లో కనిపించాక మళ్ళీ పవన్ పిక్ బయటికి రాలేదు. తమిళ చిత్రం వినోదియం సిత్తం ని తెలుగులో పవన్-సాయి తేజ్ కలయికలో సముద్ర ఖని దర్శకత్వంలో రీమేక్ చేస్తున్నారు,.
అయితే పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి సంబందించిన 20 రోజుల డేట్స్ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో బిజీగా వున్నారు. ఈ షూటింగ్ పూర్తి కాగానే.. ఈ నెలాఖరు నుండి పవన్ కళ్యాణ్ హారిష్ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ లో హాజరు కానున్నారు. హరీష్ ఇప్పటికే సినిమా గ్రౌండ్ వర్క్ పూర్తి చేసి పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఫ్లైట్ లో వెళుతున్న లుక్ ఒకటి బయటికి వచ్చింది.
స్పెషల్ ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఆర్మీ ప్యాంటు లో బ్లాక్ టీ షర్ట్ లో.. కళ్ళకి గాగుల్స్ పెట్టుకుని చాలా అంటే చాలా స్టయిల్ గా కనిపించారు. కొద్దిరోజులుగా పవన్ బయట కనిపించకుండా.. ఇలా ఇప్పుడు సడన్ గా ఆయన లుక్ బయటికి రావడంతో పవన్ ఫాన్స్ ఆ పిక్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.