టాలీవుడ్ సీనియర్ హీరోల్లో వెంకటేష్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలని ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఆదరిస్తారు. తన ఏజ్ కి సరిపోయే పాత్రలతో వెంకీ సినిమాలు చేస్తున్నారు. అటు రానా బాహుబలిలో విలన్ గాను, లీడర్ గా, నేనే రాజు నేనే మంత్రి అంటూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నాడు. వెంకీ-రానా కలిసి సినిమా చేస్తే బావుంటుంది అని దగ్గుబాటి అభిమానుల కోరిక ఎప్పటిదో.. కానీ వీరిద్దరూ కలిసి నెట్ ఫ్లిక్స్ కోసం జత కట్టారు. అది కూడా వెబ్ సీరీస్ కోసం. రానా-నాయుడు అంటూ పవర్ ఫుల్ టైటిల్ తో తెరకెక్కిన ఈ వెబ్ సీరీస్ నిన్నటినుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ లోకి వచ్చింది. ఎంతో క్రేజీగా రానా నాయుడు చూసేందుకు తెలుగు ఆడియన్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు.
కానీ రానా నాయుడు వీక్షించిన ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు కరెంట్ షాక్ కొట్టిన కాకుల్లా ఉండిపోతున్నారు. కారణం బండ బూతులు ఉన్న ఈ సీరీస్ ని ఒకొక్కరినే ఎందుకు చూడమని వెంకటేష్ అంత ప్రత్యేకంగా చెప్పారో అర్ధమై షాకైపోతున్నారు. ఇది ఫ్యామిలీ ఆడియెన్స్ చూసే కంటెంట్ కాదు, సిరీస్ కాదని చాలామంది ముఖ్తకంఠంతో చెబుతున్న మాట. రానా, వెంకటేష్ అద్భుతంగా నటించారు. వారి నటనకు పేరు పెట్టాల్సిన పనే లేదు. బ్యాగ్రౌండ్ స్కోర్, క్లైమాక్స్ బాగున్నాయి. కానీ ఇందులో నెట్‌ఫ్లిక్స్ మాటలు, ఇబ్బందికరమైన సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఇంకా నిడివి అయితే బాగా ఇబ్బంది పెట్టేస్తుంది. తెలుగు హీరోల అప్‌డేట్ వెర్షన్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇది అసలు మన తెలుగు హీరోలు చేసిందేనా.. అంటూ నోరెళ్లబెడుతున్నారు. వెంకటేష్ బూతు వీడియోతో రెచ్చిపోయారంటున్నారు. రానా నాయుడు వెబ్ సిరీస్ చూసిన తర్వాత చాలామంది వెంకటేష్ మాట్లాడిన బూతుల గురించే చర్చించేస్తున్నారు. ఏ సీన్ చూసినా బూతు లేకుండా లేదు.. తెలుగోళ్లయి ఉండి.. తెలుగు ప్రేక్షకులకి ఇంత షాకిస్తారా నాయుడు గారు అంటూ తెలుగు ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా వెంకీ-రానాలని టాగ్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు.