Advertisement
Google Ads BL

తిరుమలలో కొడుకు అన్వై తో దిల్ రాజు


వారసుడితో సో సో హిట్ కొట్టి.. చిన్న సినిమా బాలగంతో భారీ హిట్ కొట్టిన దిల్ రాజు.. బలగం సక్సెస్ సెలెబ్రేషన్స్, ఇంటర్వూస్ అన్ని పూర్తి కావడంతో తన భార్య కొడుకుతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుపతి వెళ్లారు. శుక్రవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో దిల్ రాజు ఫ్యామిలీతో సహా కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. భార్య తేజస్విని, కుమారుడు అన్వై రెడ్డి, సోదరుడు శిరీష్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి దిల్ రాజు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. 

Advertisement
CJ Advs

దర్శనానంతరం మీడియాతో మాట్లాడి.. మాఢవీధుల్లో నడుచుకుంటూ వెళ్లడంతో ఫోటో గ్రాఫర్స్ తమ కెమెరాలకు పని కల్పించారు. అయితే దిల్ రాజు ప్రత్యేకంగా తిరుమలకి వెళ్ళింది ఆయన కుమారుడి తలనీలాలను స్వామివారికి సమర్పించడానికి అని తెలుస్తుంది. స్వామివారి దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనాలు అందించారు. శ్రీవారి దర్శనానంతరం తీర్ధ ప్రసాదాలు అందుకున్న దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. తన బలగంతో స్వామి దర్శనానికి వచ్చానని చెప్పారు. 

గత వారమే బలగం సినిమా విడుదలైంది. ఇంత చిన్న సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా హిట్ కావడంతో అందరం కలిసి స్వామివారి దర్శనానికి వచ్చాం. బలగం సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. అయితే ఈ దర్శనంలో దిల్ రాజు కొడుకు అన్వై రెడ్డి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు.

Producer Dil Raju, his family visit Tirumala temple:

Dil Raju With His Family Visits Tirumala Temple 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs