Advertisement
Google Ads BL

పాన్ ఇండియా మూవీని ఇలా వదిలేశారేంటి?


తెలుగు సినిమాలని పాన్ ఇండియా మార్కెట్ లోకి తీసుకువెళ్లాలని తహతహలాడుతున్నారు. స్టార్ హీరోలే కాదు.. సమంత లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా పాన్ ఇండియా ఫిలిమ్స్ చేస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ అయినప్పటికీ.. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ తో వచ్చిన క్రేజ్ ఆమెకి ప్లస్ అవుతుంది అని నిర్మాతలు కూడా సమంత తో పాన్ ఇండియా మూవీస్ ప్లాన్ చేస్తున్నారు. ఇక స్టార్ హీరోలైతే పాన్ ఇండియా మూవీ చేస్తున్నామని చెప్పడమే కాదు, రాజమౌళి వేసిన రాచ మార్గంలో పయనిస్తూ ప్రమోషన్స్ చేసేస్తున్నారు. 

Advertisement
CJ Advs

ఇప్పుడు సమంత నటించిన శాకుంతలం పాన్ ఇండియాలోని పలు భాషల్లో విడుదల చేస్తున్నామంటూ ప్రకటించారు మేకర్స్. ఫిబ్రవరిలోనే విడుదల కావల్సిన శకుంతలాన్ని ఏప్రిల్ కి షిఫ్ట్ చేసారు. శాకుంతలం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ హిందీ భాషల్లో విడుదల చేస్తామని గుణ శేఖర్ చెప్పారు. మరి ఆ మేరకు ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టాల్సింది. కానీ శాకుంతలం టీమ్ కామ్ గా ఉంది. 

మరోపక్క శాకుంతలం మరోసారి పోస్ట్ పోన్ అయ్యే సూచనలు ఉన్నాయంటూ మరో వార్త చక్కర్లు కొట్టిన కొన్ని గంటల్లోనే టీమ్ అలెర్ట్ అయ్యి అదేమీ లేదు.. అనుకున్న సమయానికే శాకుంతలం అంటున్నారు.

కానీ ప్రమోషన్స్ హడావిడి లేకపోయేసరికి అదే నిజమంటుకుంటున్నారు. మరోపక్క సమంత ముంబై టు హైదరాబాద్ అంటూ తిరుగుతుంది. అక్కడ సిటాడెల్ వెబ్ సీరీస్ ఇక్కడ విజయ్ దేవరకొండ తో ఖుషి షూటింగ్ లో జాయిన్ అవడం.. మరి సమంత ఇచ్చే డేట్స్ ని బట్టి శాకుంతలం ప్రమోషన్స్ ఏమైనా స్టార్ట్ చేస్తారేమో గుణ శేఖర్ వాళ్ళు చూడాలి. 

Why did you leave the Pan India movie like this?:

When will Shaakuntalam promotions start?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs