Advertisement
Google Ads BL

నయన్ పై హీరోయిన్ ఇండైరెక్ట్ కామెంట్స్


నయనతారపై ఈమధ్యన కోలీవుడ్ నటి మాళవిక మోహనన్ చేసిన లేడీ సూపర్ స్టార్ కామెంట్స్ వైరల్ అవ్వగా.. అవి నయనతార అభిమానులకి కోపం తెప్పించడంతో మాళవికని దారుణంగా ట్రోల్ చేసారు. దానితో మాళవిక మోహనన్ సారి చెప్పింది. అయితే తాజాగా మమతా మోహన్ దాస్ నయనతారపై చేసిన ఇండైరెక్ట్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తానొక హీరోయిన్ వలన నాలుగు రోజులు నష్టపోయినట్లుగా చెప్పింది. తాను గనక సెట్స్ లో ఉంటే ఆమె(నయనతార) షూటింగ్ కి రానని మొండికేసినట్టుగా చెప్పుకొచ్చింది.

Advertisement
CJ Advs

ఒకసారి రజినీకాంత్ సినిమాలో నాకు అవకాశం వచ్చింది. అందులో ఓ సాంగ్ కోసం మూవీ యూనిట్ నన్ను సంప్రదించగా నేను ఓకె చెప్పాను, ఆ సాంగ్ ని ఓ నాలుగు రోజుల పాటు షూట్ చేసాము. పాట చిత్రీకరణ సమయంలోనే ఆ ఫ్రేమ్ లో నేను ఉండదని అర్ధమైంది. తీరా ఫైనల్ కాపీ వచ్చేసరికి నా షాట్స్ లేకుండా చేసారు. ఇదంతా ఆ సినిమాలో నటించిన హీరోయిన్(నయనతార) వలనే అని తర్వాత తెలిసింది అంటూ హాట్ కామెంట్స్ చేసింది. ఆ సాంగ్ లో మరో హీరోయిన్ ఉంటుంది అని నాకు చెప్పలేదని.. ఆ పాట షూటింగ్ కి రానని ఆమె(నయన్) చెప్పిందట. 

అందుకే నా పార్ట్ ని షూట్ చెయ్యలేదు. ఆ చిత్రం కోసం నాలుగు రోజులు వేస్ట్ అయినందుకు బాధపడ్డాను అంటూ నయన్ పై మమతా మోహన్ దాస్ ఇండైరెక్ట్ గా కామెంట్ చేసింది. రజినీకాంత్-నయన్ జంటగా తెరకెక్కిన కథానాయకుడులో మమతా ఓ సాంగ్ లో చిన్న గెస్ట్ రోల్ చేసింది. ఇప్పుడా రోల్ పైనే మమతా మోహన్ దాస్ నయన్ పై ఇలాంటి కామెంట్స్ చేసింది.. అంటూ నెటిజెన్స్ కూడా ఫిక్స్ అవుతున్నారు. 

Heroine Indirect Comments on Nayan:

Mamatha Mohan Das indirect comments on Nayanthara
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs