కిర్రాక్ ఆర్పీ నుండి చేపల పులుసు ఆర్పీ గా టర్న్ అయిన ఆర్పీ ఇప్పుడు నెల్లూరు పెద్ద రెడ్డి చేపల పులుసు బ్రాంచెస్ ఓపెనింగ్స్ లో బిజీగా మారాడు. కూకట్ పల్లి బ్రాంచ్ సూపర్ సక్సెస్ అవడంతో రెండు నెలల్లో మణికొండ లో మరో బ్రాంచ్ ఓపెన్ చేసిన ఆర్పీ, దాని ఓపెనింగ్ కోసం జబర్దస్త్ లో తనని విమర్శించిన వారందరిని ఇన్వైట్ చేసి ఆ బ్రాంచ్ ని సక్సెస్ చేసాడు. గత నెలలోనే మొదలైన ఆ బ్రాంచ్ అక్కడ హిట్ అవగా.. ఇప్పుడు అమీర్ పేటలో మూడో బ్రాంచ్ ని ఓపెనింగ్ చేసి షాక్ ఇచ్చాడు.
తనకి కాబోయే భార్య లక్కీతో కలిసి ఆర్పీ చేపల పులుసు హంగామా మాములుగా లేదు. ఇక ఈ ఓపెనింగ్ కి హీరో కమ్ విలన్ శ్రీకాంత్ ని పిలిచినా కుదిరితే వస్తా అన్న ఆయన మాకు సర్ ప్రైజ్ ఇచ్చి ఓపెనింగ్ కి వచ్చారని చెప్పిన ఆర్పీ అతనికి కాబోయే భార్యతో కలిసి శ్రీకాంత్ దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఇప్పటికే శ్రీకాంత్ గారు మూడుసార్లు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు తీసుకెళ్లారని కూడా చెప్పాడు. అయితే తన చేపల పులుసు బ్రాంచెస్ మూడు మాత్రమే అని, ఇకపై తన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుపై ఫ్రాంచైసీస్ ప్లాన్ చేస్తున్నామని చెప్పాడు.
కేవలం డబ్బు కోసమే కాదు.. క్వాలిటి, క్వాంటిటీని దృష్టిలో పెట్టుకుని తన ఈ బిజినెస్ చేస్తున్నానని చెప్పాడు ఆర్పీ. శుభ్రంగా ఉండేలా కిచెన్ వర్క్ చేస్తూ కట్టెల పొయ్యిమీదే చేపల పులుసు వండుతున్నామని, అలాగే ప్లాస్టిక్ వాడకుండా చూస్తున్నామని, ఒక కేజీ చేపల పులుసు అయితే కుండలో పెట్టి స్పెషల్ గా ఇస్తామంటూ తన షాప్ లోని స్పెషల్స్ గురించి యూట్యూబ్ ఛానల్స్ లో చెప్పుకొచ్చాడు ఆర్పీ.