Advertisement
Google Ads BL

ఉస్తాద్ లోకి పవన్ ఎంటర్ అయ్యేది అప్పుడే


పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్ ని పక్కనబెట్టి మేనల్లుడు సాయి తేజ్ తో కలిసి చేస్తున్న తమిళ వినోదియం సిత్తం చిత్రాన్ని రీమేక్ చేసేస్తున్నారు. సముద్రఖని దర్శకత్వంలో ఆ చిత్ర షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుండగా.. పవన్ కళ్యాణ్ తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో తలమునకలై ఉన్నారు. అయితే ఈ షూటింగ్ పవన్ కంప్లీట్ చెయ్యగానే ఆయన హరీష్ శంకర్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ సెట్స్ లో జాయిన్ అవుతారని తెలుస్తుంది.

Advertisement
CJ Advs

గత డిసెంబర్ లోనే ఉస్తాద్ భగత్ సింగ్ పూజా కార్యక్రమాలతో మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ గా లాంచ్ చేసారు. ఈ చిత్రం మార్చి 15 నుండి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. త్వరలోనే పవన్ ఉస్తాద్ లుక్ టెస్ట్ లో పాల్గొంటారని సమాచారం. పవన్ కళ్యాణ్ మొదటికి షెడ్యూల్ లో జాయిన్ అవుతారని.. కొద్దిరోజుల పాటు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ చేసి తర్వాత సుజిత్ తో చేస్తున్న OG సెట్స్ లో జాయిన్ అవుతారని టాక్. 

అయితే పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న హరి హర వీరమల్లు షూటింగ్ మాత్రం ఎంతవరకు పూర్తయ్యిందో.. ఎప్పుడు రిలీజ్ డేట్ ఇస్తారో అనే విషయంలో ఇంతవరకు క్లారిటీ అయితే లేదు. దానితో పవన్ ఫాన్స్ కాస్త కంగారు పడుతున్నారు.

Look tests underway for Ustad Bhagat Singh:

Ustad Bhagat Singh in look tests
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs