Advertisement
Google Ads BL

ఎన్టీఆర్-చరణ్-బన్నీతో డాన్స్ చేస్తా: సాయి పల్లవి


టాలీవుడ్ లో ఎన్టీఆర్-రామ్ చరణ్-అల్లు అర్జున్ ముగ్గురూ డాన్సుల్లో తోపులే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని లెక్కలేసుకోవడానికి లేదు. ఒకరినిమించి ఒకరు డాన్స్ స్టెప్స్ ఇరగదియ్యగలరు. అలాంటి ముగ్గరు స్టార్ హీరోలతో డాన్సుల్లో నెంబర్ 1 అయిన సాయి పల్లవి జోడి కడితే.. ఇది చాలామంది అభిమానుల్లో ఉన్న కోరిక. ఎన్టీఆర్ తో సాయి పల్లవి, రామ్ చరణ్ తో సాయి పల్లవి అంటూ రకరకాల వార్తలు వచ్చినా సాయి పల్లవి ఇప్పటివరకు ఒక్క స్టార్ హీరో సినిమాలో చెయ్యలేదు.

Advertisement
CJ Advs

సాయి పల్లవి గ్లామర్ షోకి నో, ముద్దు సీన్స్ కి నో, అందుకే సాయి పల్లవికి అంత టాలెంట్ ఉన్నా, డాన్సుల్లో నెంబర్ 1 అయినా ఆమెకి స్టార్ హీరోల అవకాశాలు రాలేదు. ఆఖరికి మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ వచ్చినా సాయి పల్లవి పట్టించుకోలేదంటే.. ఇక ఆమెకి ఏ స్టార్ హీరో అవకాశమివ్వగలరు. అయితే తాజాగా స్మిత నిజం షోకి గెస్ట్ గా వచ్చిన సాయి పల్లవి పాల్గొన్న ఎపిసోడ్ ప్రోమోలో.. ఎన్టీఆర్-చరణ్-బన్నిలలో ఎవరితో ఛాన్స్ వస్తే డాన్స్ వేస్తారు అని స్మిత సాయి పల్లవిని అడగగా.. దానికి సాయి పల్లవి.. ఎన్టీఆర్-చరణ్-బన్నీ ముగ్గురూ నాతో ఒక పాట చేస్తే బాగుంటుందని చెప్పింది,.

మరి నిజంగా సాయి పల్లవి ఈ ముగ్గురు హీరోల్లో ఏ హీరోతో కాలు కదిపినా అది ఒక సెన్సేషన్ అవడం ఖాయం. ఇంకా ఈ షోలో సాయి పల్లవి మీటూ ఉద్యమం గురించి ఇంట్రెస్టింగ్ గా మాట్లాడింది. వేధింపులు అంటే కేవలం శారీరకంగానే కాదు, మానసికంగానూ ఉంటుందని, శారీరకంగా వేధింపులకు గురిచేయకపోవచ్చు.. కానీ మీ మాటలతో పక్కవారిని ఇబ్బందిపెట్టినా అది వేధింపులతోనే సమానం అంటూ సాయి పల్లవి సెన్సేషనల్ గా మాట్లాడింది.

Sai Pallavi will do a song with NTR-Charan-Bunny:

Sai Pallavi says she wants to dance with NTR, Allu Arjun, ram Charan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs