Advertisement
Google Ads BL

ఏదో తేడా కొడుతోంది సానియా


సానియా మీర్జా ఆమె భర్త షోయబ్ మాలిక్ విడాకులు తీసుకోబోతున్నారంటూ ఓ వార్త గత ఏడాది సోషల్ మీడియాలో పెను సంచలనంగా మారగా.. అదంతా గాసిప్ మాత్రమే అనేలా షోయబ్ తో కలిసి సానియా మీర్జా ఓ షో కోసమే ఇలాంటి ప్లాన్ చేసి రూమర్స్ పుట్టించారని అన్నారు. తర్వాత దుబాయ్ లో షోయబ్ తో కలిసి సానియా ఉంటున్నట్లుగా చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే సానియా మీర్జా తో భర్త షోయబ్ కలిసి ఉండడం లేదు, వారి మధ్యన విడాకులు అనే విషయం నిజమనేలా మరో వార్త ఇప్పుడు ప్రచారంలోకి రావడం కాదు.. ప్రస్తుతం ఉన్న సిస్ట్యువేషన్ చూస్తే అదే నిజమనిపిస్తుంది.

Advertisement
CJ Advs

ఎందుకంటే బ్యాట్మెంటన్ నుండి సానియా మీర్జా తప్పుకుంది. ఆమె వీడ్కోలు మ్యాచ్ కి అలాగే ఆమె ఇచ్చిన పార్టీకి టాలీవుడ్ నుండి సెలబ్రిటీస్, ఇంకా క్రికెటర్స్, అలాగే కోలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహ్మాన్ తో సహా పలువురు హాజరయిన విషయం తెలిసిందే,. మహేష్ బాబు, నమ్రత, రెహ్మాన్ ఈ ఈవెంట్ లో స్పెషల్ గా కనిపించారు. ఎంతో గ్రాండ్ గా సానియా మీర్జా ఏర్పాటు చేసిన పార్టీకి పలువురు ప్రముఖులు హాజరవగా ఈ పార్టీకి సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ హాజరు కాకపోవడం ఇప్పుడు వారి మధ్యన సఖ్యత లేదు అనే అనుమానాలకు తావిస్తుంది. 

ఈ పార్టీలో సానియా మీర్జా తల్లితండ్రులు, ఇంకా చెల్లి, ఆమె భర్త ఉన్నారు. అలాగే సానియా కొడుకు కూడా కనిపించాడు.. ఒక్క షోయబ్ మాలిక్ తప్ప. సానియా ఫేర్‌వెల్‌ పార్టీకి షోయబ్‌ హాజరుకాకపోవడంతో వీరి మధ్య పొరపచ్చాలు నిజమేనంటున్నారు నెటిజన్లు. అంతేకాదు సానియా-షోయబ్ త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారని మరోసారి చర్చించుకుంటున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే సానియా దంపతులు కలిసి కనబడినా ఓకె.. లేదంటే ఈ విషయమై ఎవరో ఒకరు స్పందించినా ఓకె.

Shoaib Malik Misses Sania Mirza Farewell Party:

Shoaib Malik missed Sania Mirza retirement farewell party
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs