యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సౌత్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది శ్రీదేవి కుమర్తె జాన్వీ కపూర్. ఇప్పటివరకు బాలీవుడ్ లోనే టాప్ పొజిషన్ కి వెళదామని చూసిన జాన్వీ కి అక్కడ సో సో చిత్రాలు తప్ప సూపర్ హిట్ అనేది లేకపోవడంతో చేసేది లేక మంచి పాన్ ఇండియా ఫిల్మ్, పాన్ ఇండియా స్టార్ తో సౌత్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది. ముందుగా అలియా భట్ ని తీసుకుంటే ఆమె పెళ్లి, ప్రెగ్నెంట్ వలన ఆమె NTR30 ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. తర్వాత కియారా అనుకుంటే ఆమె డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోవడంతో ఆమె స్థానంలోకి జాన్వీ కపూర్ ని తీసుకొచ్చారు.
మార్చ్ 6 న జాన్వీ కపూర్ బర్త్ డే రోజున పోస్టర్ తో సహా ఎన్టీఆర్ 30 హీరోయిన్ గా జాన్వీని ప్రకటించారు మేకర్స్. అయితే ఈచిత్రానికి జాన్వీ కపూర్ 5 కోట్లు డిమాండ్ చెయ్యగా.. మేకర్స్ మారుమాట్లాడకుండా ఇచ్చేశారనే టాక్ నడుస్తుంది. కానీ జాన్వీ కపూర్ కి NTR30 మేకర్స్ ఇచ్చేది 2.5 కోట్లేనట. పైన ఓ కోటి ఆమె ఖర్చులు భరాయించేందుకు మేకర్స్ ఒప్పుకున్నారట. అంటే తన స్టాఫ్ కి ఇంకా ఆమె ఫ్లైట్ చార్జెస్ అన్ని కలిపి ఓ కోటి లెక్కతేలుతుండగా.. ఆ 2.5 ప్లస్ 1 కోటి కలిసి 3.5 కోట్లన్నమాట. సో సోషల్ మీడియాలో జరిగే జాన్వీ కపూర్ 5 కోట్ల డిమాండ్ ప్రచారం ఒట్టిదే అంటున్నారు.
ఇక మార్చి 20 నుండి NTR30 రెగ్యులర్ షూట్ మొదలు పెడతారని.. మొదటి షెడ్యూల్ లో ఎన్టీఆర్ పై యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసిన తర్వాత కొరటాల సెకండ్ షెడ్యూల్ కోసం జాన్వీ కపూర్ ని ముంబై నుండి రప్పిస్తారని తెలుస్తుంది.