Advertisement
Google Ads BL

ఫైనల్లీ ధమ్కీ డేట్ వచ్చేసింది


ఫిబ్రవరిలో రిలీజ్ అంటూ గత ఏడాది డిసెంబర్ లోనే దాస్ కా ధమ్కీ మొదటి ట్రైలర్ ని బాలకృష్ణ చేతుల మీదుగా రిలీజ్ చేసి నానా హడావిడి చేసాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. దర్శకుడిగా, నిర్మాతగా కొత్త అవతారమెత్తిన విశ్వక్ సేన్ ధమ్కీ సాంగ్స్ రిలీజ్ చేస్తూ హంగామా చేసి ఫిబ్రవరిలో సినిమాని పోస్ట్ పోన్ చేసాడు. ఇప్పటివరకు డేట్ ఇవ్వకుండా ధమ్కీ రిలీజ్ ప్రమోషన్స్ అంటూ తిరుగుతున్నాడు విశ్వక్. పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ చేసందుకు రెడీ అయ్యి మార్చి రిలీజ్ అంటూ ఆ డేట్ మెన్షన్ చెయ్యకుండా కన్ఫ్యూజ్ చేసాడు.

Advertisement
CJ Advs

తాజాగా దాస్ కా ధమ్కీ చిత్రం మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సినిమాలో విశ్వక్ పాత్రలోని రెండు షేడ్స్‌ని చూపించే అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆసక్తికరంగా వుంది. పోస్టర్‌లో క్లాస్‌తో పాటు మాస్ అవతార్‌ లో కనిపించారు విశ్వక్ సేన్. అత్యంత భారీ బడ్జెట్‌తో వున్నత నిర్మాణ విలువలతో రూపొందిన ఈ చిత్రానికి విశ్వక్ కథానాయకుడు, దర్శకుడు నిర్మాత కూడా. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ జోడిగా నివేదా పేతురాజ్ నటిస్తోంది.

Das Ka Dhamki Releasing Worldwide In Theatres :

Vishwak Sen Das Ka Dhamki Releasing Worldwide In Theatres On March 22nd
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs