యంగ్ టైగర్ ఎన్టీఆర్-రామ్ చరణ్ నాటు నాటు సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఆ సాంగ్ ప్రతి సినిమా అవార్డుని కైవసం చేసుకోగా.. ఒరిజినల్ పాట విభాగంలో ఆస్కార్ అవార్డు కోసం పోటీ పడుతుంది. ఆ పాటలో ఎన్టీఆర్-రామ్ చరణ్ ల డాన్స్, అలాగే కీరవాణి మ్యూజిక్, చంద్రబోస్ లిరిక్స్ అన్ని అద్భుతమే. సినిమాలో ఎన్టీఆర్-రామ్ చరణ్ యాక్షన్ కి వాళ్ళ ఫాన్స్ ఎంతగా కదిలిపోయారో.. ఆ నాటు నాటు పాటలో వేసిన డాన్స్ ప్రపంచ వ్యాప్తంగా హైలెట్ అయ్యింది.
తాజాగా గరికపాటి నరసింహారావు ఆర్.ఆర్.ఆర్ ఆస్కార్ బరిలో నిలవడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చెయ్యడమే కాదు.. రామ్ చరణ్-ఎన్టీఆర్ లు కవల పిల్లలకన్నా ఎక్కువ అంటూ చేసిన కామెంట్స్ ఎన్టీఆర్-చరణ్ ఫాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు పాటకి ఆస్కార్ రావాలని దణ్ణం పెట్టుకోండి, ఆ పాటలో చరణ్-ఎన్టీఆర్ ల పెరఫార్మెన్స్ అద్భుతం. కీరవాణి సంగీతం, రాజమౌళి దర్శకత్వం, చంద్రబోస్ అద్భుత రచన కారణంగా ఇవ్వాళ తెలుగోడి సత్తా చాటుతూ ప్రపంచస్థాయి బహుమతి రాబోతుంది. ఇక ఎన్టీఆర్-చరణ్ కవలలుకు కూడా సాధ్యం కాదేమో అన్నంతగా ఆ పాటలో ఆయన బెల్ట్ తీస్తే ఈయన తీశారు, ఈయన కుడికాలు కడితే ఆయనా కుడికాలు కదిపారు.
రెండు వేర్వేరు కుటుంబాల్లో పుట్టిన ఇద్దరు మహానటులు.. ఇద్దరూ అటువంటి నటన చేసారంటే, నా కన్నా చిన్నవారైనా ఇద్దరికీ నా నమస్కారం అంటూ గరికపాటి చేసిన వ్యాఖ్యలను ఎన్టీఆర్-చరణ్ ఫాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇలా గరికపాటి తన గొంతుతో వినిపించినా.. ప్రతి తెలుగువాడు, ప్రతి భారతీయుడి కోరిక అదే.