Advertisement
Google Ads BL

రెండు నెలల్లో గుడ్ న్యూస్ అంటున్న చరణ్


రామ్ చరణ్-ఉపాసనలు ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెబుతారా అని మెగా ఫ్యామిలీ పదేళ్లుగా ఎదురు చూసింది. గత ఏడాది ఉపాసన ప్రెగ్నెంట్ అన్న విషయం బయటపెట్టి మెగా ఫ్యామిలీకి ముఖ్యంగా మెగాస్టార్ చిరు దంపతులకి సంతోషాన్ని ఇవ్వగా.. ఈ ఏడాది రామ్ చరణ్ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసిషియన్ అవార్డ్స్ అందుకుని మెగా ఫాన్స్ కి మరింత సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇప్పుడు హాలీవుడ్ మూవీస్ విషయంలో రామ్ చరణ్ ఇచ్చిన క్లారిటీ మెగా ఫాన్స్ సంబరాలు చేసుకునేలా చేసింది.

Advertisement
CJ Advs

అమెరికాలో హాలీవుడ్ మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్న రామ్ చరణ్ పర్సనల్ విషయాలతో పాటుగా.. కెరీర్ కి సంబందించిన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నాడు. తాజాగా సామ్ ఫ్రాగోసో నిర్వహిస్తున్న టాక్ ఈజీ షో 320 ఎపిసోడ్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. హాలీవుడ్ ఎంట్రీ పై గుడ్ న్యూస్ చెప్పాడు. అంతర్జాతీయ ప్లాట్ ఫామ్ అయిన ఆస్కార్స్ లో ఆర్.ఆర్.ఆర్ గుర్తింపు పొందడమే తమ అంతిమ లక్ష్యమని చెప్పిన చరణ్.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమయిందని చెప్పాడు.

అంతేకాకుండా కొన్ని హాలీవుడ్ స్టూడియోలతో సినిమాల విషయంలో చర్చలు కొనసాగుతున్నాయని.. మరో రెండు నెలల్లో గుడ్ న్యూస్ ఉంటుందని తెలిపిన చరణ్.. గొప్ప సినిమాలను ఆదరించే ప్రతి దేశంలో తాను నటించాలనుకుంటున్నానని చెప్పి మెగా ఫాన్స్ కి మరింత కిక్ ఇచ్చాడు.

Ram Charan says that he will announce his Hollywood debut:

Ram Charan says that he will announce his Hollywood debut in a couple of months
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs