Advertisement
Google Ads BL

జబర్దస్త్ లో ఇష్టం లేకుండా ఉన్నారా?


కొంతమంది సినిమా అవకాశాలతో జబర్దస్త్ ని పూర్తిగా పక్కనబెట్టి కెరీర్ లో ముందుకు వెళుతున్న వారూ ఉన్నారు. కొంతమంది జబర్దస్త్ లో కంటిన్యూ అవుతూనే వెండితెర మీద అవకాశాలతో హంగామా చేస్తున్న వారూ ఉన్నారు. మరికొంతమంది జబర్దస్త్ అవకాశం పోయి వేరే దారిలో బిజీ అయిన వారూ ఉన్నారు. అలా జబర్దస్త్ ని వదిలి వెళ్లినవారిలో చమ్మక్ చంద్ర, వేణు, ధనరాజ్ ఇలా కొంతమంది మరోసారి జబర్దస్త్ లో కనిపించలేదు. తాజాగా సుధీర్ పరిస్థితి అదే. కొంతమంది జబర్దస్త్ నుండి కొద్దిగా బ్రేక్ తీసుకుని మళ్ళీ వచ్చేసారు.

Advertisement
CJ Advs

అలా వచ్చిన వారిలో హైపర్ ఆది, గెటప్ శ్రీను ఉన్నారు. వీళ్ళు సినిమాల కోసం కొద్దిగా గ్యాప్ తీసుకుని మళ్ళీ జబర్దస్త్ లో వచ్చారు. కానీ వారిలో మునుపుటి ఉత్సాహం కానీ, మునుపుటి యాక్టీవ్ నెస్ కానీ కనిపించడమే లేదు. ఏదో ఇష్టం లేనట్టుగానే వారు కనిపించడం ప్రేక్షకులకి బోర్ కొట్టిస్తుంది. సినిమా స్క్రిప్ట్స్ రాస్తూ హైపర్ ఆది బిజీ గా ఉన్నాడు. ఇక శ్రీను మెగాస్టార్ సినిమాల కేరెక్టర్స్ తో బిజీగా ఉట్నూన్నాడు. జబర్దస్త్ నుండి పూర్తిగా తప్పుకుంటే ఎలా ఉంటుందో వారికీ తెలుసు. అందుకే జబర్దస్త్ లో అలా అలా కొనసాగుతూ వారు బయటపనులు చక్కబెట్టుకుంటున్నారు. 

అయితే గతంలోలా ఆది స్కిట్ లో పస లేదు, గెటప్ శ్రీను గెటప్స్ లో క్రేజీ గెటప్ లేదు. అంటే వారు స్కిట్స్ ని నామమాత్రంగా లాగించేస్తున్నారామె అనే అనుమానాలు తడుతున్నాయి.. ఇప్పుడు కామెడీ ప్రేక్షకులకి.

Are they doing it unwilling in Jabardasth?:

Hyper Aadi, Getup Srinu not interested in Jabardasth
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs