Advertisement
Google Ads BL

ఆర్.ఆర్.ఆర్ ఆస్కార్ పై హాట్ కామెంట్స్


ఆర్.ఆర్.ఆర్ టీమ్ మొత్తం అమెరికాలో సందడి కాదు హడావిడి చేస్తుంది. గత 20 రోజులుగా అంతర్జాతీయ మీడియాలో వీళ్ళ సందడే కనబడుతుంది. ఆస్కార్ కోసం ఆశగా ఎదురు చూస్తుంది. నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ వస్తుంది అనే అతృతతో రెండు తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ భరత్ దేశం ఎదురు చూస్తుంది. ఆర్.ఆర్.ఆర్ కి ఆస్కార్ వచ్చినా రాకపోయినా.. అంతటి ఘనతని ఈ సినిమా దక్కించుకుంది. ఆస్కార్ అంటూ ఆర్.ఆర్.ఆర్ ని కొంతమంది పొగుడుతుంటే.. మరికొంతమంది మాత్రం ఆర్.ఆర్.ఆర్ టీమ్ ఈ స్థాయిలో అమెరికాలో చేస్తున్న హడావుడిని విమర్శిస్తున్నారు.

Advertisement
CJ Advs

అసలు ఆర్.ఆర్.ఆర్ నిర్మాత లేకుండానే ఈ అవార్డు వేడుకలకి మిగతా టీమ్ మొత్తం వెళ్లడంపై పలు విమర్శలు వినిపిస్తున్న సమయంలో.. తెలుగు దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆర్.ఆర్.ఆర్ ఆస్కార్ కి పెడుతున్న ఖర్చుపై తీవ్ర విమర్శలు చెయ్యడం చర్చనీయాంశం అయ్యింది. తాజాగా ఆయన ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ఆస్కార్ ప్ర‌మోష‌న్స్ కోసం RRR టీమ్ ఏకంగా 80 కోట్లు ఖర్చు చేశారు. ఆ 80 కోట్లు మాకు ఇస్తే ఓ 10 సినిమాలు తీసి వాళ్ళ మొఖాన కొడతాం.. అంటూ తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఆర్.ఆర్.ఆర్ ఫాన్స్ కి ఆగ్రహాన్ని తెప్పించాయి.

అయితే సినిమా అవార్డ్స్ లో ఎక్కడ ఏ అవార్డు ప్రకటించినా అందులో ఆర్.ఆర్.ఆర్ ఉండేలా రాజమౌళి చూసుకోవడం, ఇటు ఇండియ‌న్ గ‌వ‌ర్న‌మెంట్ ఆర్.ఆర్.ఆర్ ను ఆస్కార్‌కు పంపకపోయినా  రాజ‌మౌళి అండ్ టీమ్ ఆస్కార్ కోసం భారీ మొత్తాన్ని ఖ‌ర్చు పెట్టి అమెరిక‌న్ డిస్ట్రిబ్యూట‌ర్స్ ద్వారా నామినేష‌న్స్‌కు పంపారు. అదన్నమాట అసలు సంగతి.

Hot comments on RRR Oscar:

Tammareddy Bharadwaj comments on RRR Oscar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs