Advertisement
Google Ads BL

ఎన్టీఆర్-ధనుష్-ఓ గాసిప్


యంగ్ టైగర్ ఎన్టీఆర్-కోలీవుడ్ హీరో ధనుష్ కలిసి మల్టిస్టారర్ చేస్తే.. అసలు ఆ ఊహే ఊపేస్తోంది. పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ తో హాలీవుడ్ మూవీస్ లో కనిపించిన ధనుష్ కలిసి సినిమా చేస్తే.. అందులోను ఎన్టీఆర్ విలన్ గా, ధనుష్ హీరోగా.. అబ్బో వింటుంటేనే గూస్ బమ్ప్స్ వచ్చేస్తున్నాయి. తమిళ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్-ఎన్టీఆర్ కలిసి మల్టీస్టారర్ సినిమా చెయ్యబోతున్నారంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న వార్త. నిజంగా అది గాసిప్ అని తెలిసినా దానిని ఎన్టీఆర్, ధనుష్ ఫాన్స్ ట్రెండ్ చేస్తున్నారంటే, ఆ కాంబో పేరు కలిసి కనబడితేనే పూనకాలు వచ్చేసేలా ఉంటాయి మరి.

Advertisement
CJ Advs

అలాంటిది నిజంగా సినిమా చేస్తే.. ఆ ఊహే మమైమరిపించేస్తుంది. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లిస్ట్ లో వెట్రిమారన్ సినిమా ఉంది అనే న్యూస్ నడుస్తుంది. NTR30 కొరటాలతో, NTR31 ప్రశాంత్ నీల్ తో, తర్వాత బుచ్చిబాబు ప్లేస్ లో వెట్రిమారన్ పేరు గట్టిగా వినిపించింది. ఇప్పుడు అదే ధనుష్-ఎన్టీఆర్ కలయికలో వెట్రిమారన్ డ్రగ్స్ నేపథ్యంలో వడ చెన్నై 2 తియ్యబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది. అటు ధనుష్ కూడా వడ చెన్నై 2 ప్లానింగ్ లో ఉన్నట్లుగా చెప్పడంతో ఈ వార్తలకి మరింత ఊతమిచ్చింది.

అయితే తాజాగా ఎన్టీఆర్ టీమ్ లైన్ లోకి వచ్చి.. ఎన్టీఆర్-ధనుష్-వెట్రిమారన్ సినిమాకు సంబంధించి అన్ వెరిఫైడ్ న్యూస్, గాసిప్ మా దృష్టికి వచ్చింది. అదంతా పూర్తిగా అవాస్తమని మేము స్పష్టం చేయాలనుకుంటున్నాం. ఇలాంటి రూమర్స్, ఊహాగానాలకు దూరంగా ఉండండి అంటూ ఎన్టీఆర్-ధనుష్ చిత్రంపై పూర్తి క్లారిటీ ఇవ్వడంతో ఈ గాసిప్స్, ఊహాగానాలకు తెర పడింది.

Jr NTR team clarifies he is not working with Dhanush :

Jr NTR team clarifies he is not working with Dhanush in Vetrimaran movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs