Advertisement
Google Ads BL

ఫస్ట్ టైమ్ పిల్లలతో పబ్లిక్ లోకి నయన్-విగ్నేష్


గత ఏడాది విగ్నేష్ శివన్.. నయనతారని వివాహం చేసుకున్నాడు. ఏడేళ్ల ప్రేమ, పెళ్లితో ఒకటైన వీరు.. వెంటనే కవలల పిల్లని ఎత్తుకుని.. అందరికి షాకిచ్చారు. సరోగసి ద్వారా బిడ్డలని కన్న నయనతార ఆ విషయంలో కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసింది. షారుఖ్ తో నయన్ నటిస్తున్న జవాన్ షూటింగ్ కోసం ప్రస్తుతం ఆమె ముంబై వెళ్ళింది. నయనతార తో పాటుగా విగ్నేష్ శివన్ కూడా ముంబై వెళ్ళాడు. అయితే నయనతార-విగ్నేష్ శివన్ లు పిల్లలని ఎత్తుకుని అప్పట్లో ఫస్ట్ పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు కానీ.. ఇప్పటివరకు మరోసారి నయన్ తన పిల్లలతో బయట కనిపించలేదు.

Advertisement
CJ Advs

ఈమధ్యన పిల్లల కోసం నయనతార సినిమాలకి గుడ్ బై చెప్పబోతోంది, కాదు పిల్లల సంరక్షణ కోసం నయనతార కొద్ది రోజులపాటు సినిమాలకి బ్రేక్ ఇవ్వబోతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆ న్యూస్ అలా ఉండగానే నయనతార- విగ్నేష్ శివన్ తమ కవలలు పిలల్లతో ఎయిర్ పోర్ట్ లో కనిపించడంతో కెమెరా మెన్స్ తమ కెమెరాలకు పని చెప్పారు. మొదటిసారి పబ్లిక్ లో నయనతార-విగ్నేష్ లు పిల్లలతో కలిసి అలా కనిపించేసరికి అభిమానులు సైతం సంతోషపడిపోతున్నారు.

సోషల్ మీడియాలో నయనతార, విగ్నేష్ శివన్ లు పిల్లలని అలా పబ్లిక్ మధ్యలోకి ఎత్తుకుని నడిచి వస్తున్న పిక్స్ వైరల్ గా మారాయి. అయితే నయన్ కానీ, విగ్నేష్ కానీ పిల్లల ఫేస్ లు కనిపించకుండా కవర్ చేస్తూ ఫొటోలకి ఫోజులిచ్చారు.

Nayanthara, Vignesh Shivan Make 1st Public Appearance:

Nayanthara And Vignesh Shivan Hide Faces Of Their Twins
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs