Advertisement
Google Ads BL

పుష్ప2 లో సాయి పల్లవి.. క్లారిటీ ఇదే


పుష్ప ద రైజ్ పాన్ ఇండియా సక్సెస్ తర్వాత అల్లు అర్జున్-సుకుమార్ లు పుష్ప ద రూల్ ని మరింత క్రేజీ గా మలుస్తున్నారు. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుంది. విలన్ పాత్రధారి మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ కూడా పుష్ప 2 షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చారు. తమిళనాట విక్రమ్ తో భారీ పాన్ కొట్టిన ఫహద్ కి తమిళంలో విపరీతమైన క్రేజ్ పెరిగింది. అది పుష్ప 2 కి యాడ్ అవడం పక్కా. అయితే పుష్ప పార్ట్2 ని నార్త్ ఇండియన్స్ కి మరింత దగ్గర చేసే ప్లాన్ లో సుకుమార్ చాలామంది పేరున్న పలు భాషా నటులని పుష్ప ద రూల్ లో భాగం చేస్తున్నారనే టాక్ నడుస్తుంది.

Advertisement
CJ Advs

విజయ్ సేతుపతిని తీసుకుంటున్నారని ఒకసారి నేచురల్ బ్యూటీ సాయి పల్లవి అంటూ ఓసారి ప్రచారం జరిగింది. అయితే ఎక్కువగా సాయి పల్లవి పుష్ప పార్ట్ 2 లో భాగం కాబోతుంది అనే న్యూస్ వినిపించింది. గత రెండు రోజులుగా సాయి పల్లవి సోషల్ మీడియాలో పుష్ప విషయంలో ట్రెండ్ అవుతుంది. తనకి నచ్చే కథలని ఎంపిక చేసుకునే సాయి పల్లవి పుష్ప 2 ని ఓకె చెయ్యడం అందరికి షాకింగ్ విషయమే ఆంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇక సాయి పల్లవి పుష్ప పార్ట్ 2 లో భాగం కావడం పక్కా అనే అనుకుంటున్నారు.

అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం సాయి పల్లవి పుష్ప పార్ట్ 2 లో భాగం కావడం లేదు, సాయి పల్లవి పుష్ప లో నటిస్తుంది అని వస్తున్న వార్తలన్నీ గాసిప్స్ అంటూ కొట్టిపారేస్తున్నారు. మరి పుష్ప మేకర్స్ రశ్మికని కాదని సాయి పల్లవిని తీసుకోరు. అలాగే సాయి పల్లవి సెకండ్ హీరోయిన్ కేరెక్టర్ ఒప్పుకోదు అనేది మరికొందరి వాదన.

Sai Pallavi in ​​Pushpa 2.. This is the clarity:

Sai Pallavi joins Allu Arjun Pushpa?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs