Advertisement
Google Ads BL

ప్రభాస్ తో పెళ్లి - కృతిసనన్ స్పందన


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్ళెప్పుడు చేసుకుంటాడా అని ఆయన కుటుంబం ఎంతగా ఎదురు చూస్తుందో  తెలియదు కానీ.. ఆయన ఫాన్స్ మాత్రం తెగ ఎదురు చూస్తున్నారు. 40 ఏళ్ళు దాటిపోయాయి. సినిమాల్లో పాన్ ఇండియా స్టేటస్ మెయింటింగ్ చేస్తున్నావ్.. కానీ పర్సనల్ లైఫ్ లో ఎందుకు పెళ్లి ఊసెత్తడం లేదు అంటూ ఆయన ఫాన్స్ ఆయన్ని అడిగినా.. నో ఆన్సర్. బాలకృష్ణ ఓపెన్ గానే అడిగారు.. ఏంటి పెళ్లి చేసుకోకుండా అని కానీ నో అనేస్తాడు. మధ్యలో ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్ తో పెళ్లి పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Advertisement
CJ Advs

సోషల్ మీడియా అయితే ప్రభాస్ కి కృతి సనన్ కి ఏకంగా ఎంగేజ్మెంట్ కూడా చేసేసింది. మాల్దీవుల్లో సీక్రెట్ గా ప్రభాస్ -కృతి సనన్ ఎంగేజ్మెంట్ అంటూ వార్తలు వండి వార్చగా.. ప్రభాస్ పిఆర్ టీం రంగంలోకి దిగి ఈ గాసిప్ ని వదిలించాల్సి వచ్చింది. ఇక కృతి సనన్ కూడా తన సైడ్ నుండి క్లారిటీ ఇచ్చింది. ఇంతగా వీరి గురించి పుకార్లు పుట్టడానికి కారణం వరుణ్ ధావన్. కృతి లైఫ్ లో స్పెషల్ పర్సన్ అంటూ ఊరించి ఇంతదాక తెచ్చాడు. తాజాగా కృతి సనన్ మరోసారి వరుణ్ ధావన్ చేసిన పెంట గురించి ప్రభాస్ కి ఫోన్ చేసి మరీ చెప్పినట్లుగా కంప్లీట్ క్లారిటీ ఇచ్చింది.

ప్రభాస్ కి నాకు మధ్యలో పెళ్లి విషయం ఇంతగా పాపులర్ అవడానికి కారణం వరుణ్ ధావన్. అతను భేడియా ప్రమోషన్స్ లో వరసగా మీడియాకి ఇంటర్వ్యూ లు ఇస్తూ బోర్ కొట్టి నీ లైఫ్ ఓ స్పెషల్ పర్సన్ ఉన్నాడని మీడియాకి చెప్తా అన్నాడు. అలాగే చెప్పు అన్నాను, కానీ నా మనసులో ఒకరున్నారని చెప్పిన వరుణ్ అక్కడ ప్రభాస్ ని లాగుతాడనుకోలేదు. అతను చేసిన పెంట గురించి చెప్పేందుకు ప్రభాస్ కి ఫోన్ చేశాను, వరుణ్ ఎందుకలా అన్నాడని ప్రభాస్ కూడా అడిగాడు, నాకు తెలియదన్నాను, అతను నా ఫ్రెండ్. కానీ పిచ్చోడు, ఎందుకలా మాట్లాడాడో తెలియదు, ఏదో మట్లాడేసాడు అన్నా. దానితో నా ఫ్రెండ్స్, సన్నిహితులు నాకు కంగ్రాట్స్ చెబుతూ మెసేజ్ లు బొకేలు పంపారంటూ వరుణ్ ధావన్ చేసిన అసలు పెంటని కృతి బయటపెట్టింది.

Marriage with Prabhas, everything is Varun Penta: Kriti Sanon:

Clarification from Kriti Sanon Regarding Prabhas
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs