Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ నువ్వు కేక


యంగ్ టైగర్ ఎన్టీఆర్ అమెరికాకి కాస్త కాదు.. దాదాపు 15 రోజులు లేట్ గా వెళ్ళాడు. అక్కడ హాలీవుడ్ అసోసిషియన్ అవార్డ్స్ వేడుకలో పాలు పంచుకోలేకపోయాడు. ఆర్.ఆర్.ఆర్ మరో హీరో రామ్ చరణ్ ఆ క్రెడిట్ మొత్తం తీసేసుకున్నాడు. అడుగడుగునా అమెరికాలో రామ్ చరణ్ హైలెట్ అయ్యాడు. దానితో ఎన్టీఆర్ ఫాన్స్ పడిన బాధ మరేవరూ పడుండారు. కానీ ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డ్స్ వేడుక కోసం సోమవారమే అమెరికాకి బయలుదేరి వెళ్ళాడు. మార్చ్ 13న జరగబోయే ఆస్కార్ వేడుకల్లో చరణ్-ఎన్టీఆర్ కలిసి సందడి చెయ్యడానికి రంగం రెడీ అవుతుంది.

Advertisement
CJ Advs

అయితే లేట్ గా వెళ్లినా లేటెస్ట్ గా వెళతా అంటూ ఎన్టీఆర్ అమెరికా కాలిఫోర్నియాలో అడుగుపెట్టింది మొదలు అందరి అటెన్షన్ తనపైనే ఉండేలా చూసుకుంటూ అక్కడి అభిమానులతో మట్లాడుతూ ఫోటోలు దిగుతూ.. ఆటోగ్రాఫ్ లు ఇస్తూ ఎన్టీఆర్ చేసిన సందడి మాములుగా లేదు. ఎన్టీఆర్ అమెరికాలో అడుగుపెట్టగానే అభిమానులు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. పేరు పేరునా అక్కడున్న అభిమానులతో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. మీరు చూపించే అభిమానానికి నా మనసులో మాట చెప్పడానికి  పెద్ద తెలుగు పదం కనిపించకపోవచ్చు. అయితే మనసులో ఒక మాట ఏంటంటే మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి వంద రెట్లు అభిమానం నా గుండెల్లో ఉంది. కానీ అది నేను చూపించలేకపోతున్నాను.

మనమధ్యన ఎలాంటి బ్లడ్ రిలేషన్ లేదు, నేనేం చేసి మీకు దగ్గరయ్యానో.. నాకు తెలియడం లేదు, మీరంతా నా సోదరులు కన్నా ఎక్కువ, మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా.. అంటూ ఎన్టీఆర్ వాళ్లతో కలిసిపోయిన తీరు చూసి ఎన్టీఆర్ నువ్ కేక, నువ్వు గ్రేట్ అన్నా అంటూ వాళ్ళు సంబరాల్లో మునిగిపోయారు.

NTR Down to Earth Speech at His Fans Meet :

NTR Down to Earth Speech at His Fans Meet California
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs