Advertisement
Google Ads BL

సుధీర్ ని పూర్తిగా దూరం పెడుతున్న మల్లెమాల


సుడిగాలి సుధీర్ ఈటీవికి దూరమయ్యాడా? దూరం చేస్తున్నారా? అనే అనుమానం సుధీర్ అభిమానుల్లో మొదలయ్యింది. కేవలం ఢీ షో, శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ ల్లో సుధీర్ కనిపించకపోవడమే కాదు.. కనీసం ఫెస్టివల్ ప్రోగ్రామ్స్ లోను సుధీర్ ఎక్కడా కనిపించడమే లేదు. యాంకర్ ప్రదీప్ ఏ ఛానల్స్ లో బిజీగా ఉన్నప్పటికీ.. ఈటివి వారు ఆ ఫెస్టివ్ ప్రోగ్రామ్స్ కి కూడా ప్రదీప్ తోనే యాంకరింగ్ చేయిస్తున్నారు కానీ.. సుధీర్ ని తీసుకురాకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.

Advertisement
CJ Advs

హైపర్ ఆది ఎంత యాక్టీవ్ గా ఉన్నప్పటికీ.. అతనికి పూర్తిస్థాయి యాంకరింగ్ బాధ్యతలు ఇవ్వకుండా ప్రదీప్ చుట్టూనే తిరుగుతున్నారు. ఇక రష్మీ ఉంటే మరొక లేడీ యాంకర్ కి చోటు దక్కడం లేదు. అసలు సుధీర్ ని ఎందుకు ఈటీవి, అందులోను మల్లెమాల యాజమాన్యం దూరం పెడుతుందో ఆయన అభిమానులకి అస్సలు అర్ధం కాక జుట్టు పీక్కుంటున్నారు. ఏ ఛానల్ లోనూ సుధీర్ ఏమి స్పెషల్ గా కనిపించకపోయేసరికి వారికి మరింత పిచ్చెక్కుతుంది. అసలు సుధీర్ అన్నని మల్లెమాల ఎందుకు దూరం చేసుకుంటుందో అంటూ తెగ ఆలోచించేస్తున్నారు వారు.

ఇప్పుడు వాళ్ళకి ఎందుకింత సడన్ గా సుధీర్ బాగా గుర్తొచ్చాడంటే.. ఈటీవీలో ఉగాది సెలెబ్రేషన్స్ లో ఆది, రష్మీ ఇంకా ప్రదీప్ మాత్రమే స్టేజ్ పై కనిపిస్తున్నారు. స్పెషల్ గెస్ట్ గా హీరోయిన్ లయ రావడంతో.. అక్కడ స్టేజ్ పై సుధీర్ మిస్ అయిన ఫీలింగ్ ని ఫాన్స్ భరించలేకపోతున్నారు.

ప్రస్తుతం హీరోగా సుధీర్ గాలోడు విడుదల కాగా.. కాలింగ్ సహస్ర తో పాటుగా ఒకటి రెండు ప్రాజెక్ట్స్ అతని చేతిలో ఉన్నాయి. హీరోగా వెండితెర మీద హడావిడి చేసేది ఏడాదికి ఒక్కసారే.. అదే బుల్లితెర మీద అయితే వారానికి ఒక్కసారైనా చూసేవాళ్లమంటూ సుడిగాలి సుధీర్ ని ఆయన అభిమానులు కలవరించేస్తున్నారు.

Mallemala is keeping Sudheer away completely:

ETV avoids Sudigali Sudheer
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs