రష్మిక మందన్న టాప్ హీరోయిన్ స్థాయి నుండి ఇప్పుడు పాన్ ఇండియా స్టేటస్ ని ఎంజాయ్ చేసే స్థాయిలో ఉండడమే కాదు.. బాలీవుడ్ లో బాగా బిజీ తారగా మారింది. నేషనల్ క్రష్ రష్మిక ఇప్పుడు క్రికెటర్స్ కి క్రష్ గా మారింది. శుభమాన్ గిల్ తనకి రష్మిక మందన్న అంటే క్రష్ అంటూ చెప్పి ఆమె రేంజ్ మరింత పెంచేసాడు. అయితే ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల చిత్రాలతో తన ప్రత్యేకతని చూపిస్తున్న రష్మిక కి అభిమాన గణం దేశ విదేశాల్లో ఉన్నారు.
అయితే రశ్మికకి హార్డ్ కోర్ ఫ్యాన్ ఒకరు ఆమెకి ఓ గిఫ్ట్ పంపించారు. అది ఏ ఇండియా ఫ్యాన్ పంపిందో కాదు.. యుకె నుండి రష్మిక ఫ్యాన్ ఒకరు సీతాకోక చిలుక డిజైన్ తో ఉన్న ఫ్లవర్ బొకేని రష్మిక కోసం పంపించి సర్ ప్రైజ్ ఇవ్వడంతో రష్మిక ఆ గిఫ్ట్ అందుకుని ఎమోషనల్ అయ్యింది. ఈ బహుమతి తన హృదయాన్ని తాకింది. ఆ గిఫ్ట్ ఎవరు పంపారో దానిలో పేరు లేదు. కానీ నేను వాళ్ళని ఎప్పటికి ప్రేమిస్తాను.
నీ గిఫ్ట్ తో నాలో నిజంగా ఆనందాన్ని నింపావు.. బిగ్ టెడ్డి బేర్ హాగ్ అంటూ పేరు లేని అభిమానిపై రష్మిక తన ప్రేమని చూపించింది. ఇదంత రష్మిక తన ఇన్స్టా స్టోరీస్ లో రాసుకొచ్చింది.