Advertisement
Google Ads BL

బాలయ్యతో సినిమాని కన్ ఫర్మ్ చేసిన కాజల్


బాలకృష్ణ తో కాజల్ అంటూ ప్రచారం జరగడం, ఈ సినిమా కోసం కాజల్ భారీ డిమాండ్ అంటూ వార్తలు రావడమే కానీ.. అనిల్ రావిపూడి ఇంతవరకు NBK108 హీరోయిన్ పై ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. ఒక హీరోయిన్ గా శ్రీలీల కన్ ఫర్మ్ అని ఎప్పుడో చెప్పిన అనిల్ రావిపూడి.. మరో హీరోయిన్ కోసం త్రిషని సంప్రదించగా.. ఆమె నో చెప్పడంతో కాజల్ అగర్వాల్ ని మీట్ అయ్యి హీరోయిన్ గా ఒప్పించారనే టాక్ నడుస్తుంది. అయితే ఎక్కడా అధికారిక వార్త లేదు. అయితే ఇప్పుడు కాజల్ అగర్వాల్ బాలయ్య తో సినిమా చేయబోతున్నట్లుగా చెన్నైలోని ఓ సినిమా ప్రెస్ మీట్ లో కన్ ఫర్మ్ చేసింది.

Advertisement
CJ Advs

కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత వెంటనే బిడ్డని కనడంతో ఆమె సినిమా కెరీర్ క్లోజ్ అనే అనుకున్నారు. కానీ కాజల్ పెళ్లి తర్వాత ఇండియన్ 2 చిత్రంలో కమల్ కి జోడిగా నటిస్తుంది. అలాగే ఆమె పోలీస్ ఆఫీసర్ గా, ఘోస్ట్ గా రెండు కేరెక్టర్స్ లో నటించిన ఘోష్టి విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడింది. తాను బిడ్డ పుట్టాక మూడు నెలలకే కెమరా ముందుకు రావడంతో చాలామంది అడిగారు. ఇలా ఎలా అని, నా బిడ్డ పుట్టాక నేను వెంటనే నటించడానికి రెడీ అయ్యాను. కారణం నా కొడుకుని అమ్మ చూసుకుంటుంది. నాకు నటన అంటే అంతిష్టం. అందుకే పనిని ప్రేమిస్తాను. బిడ్డ విషయంలో అమ్మ ఇచ్చిన భరోసాతోనే నేను ఎలాంటి బెంగ లేకుండా కెమెరా ముందు నటిస్తున్నాను.

ఇక బరువు తగ్గాలంటే క్రమశిక్షణ ఉంటే చాలు.. బరువు తగ్గడం అంత పెద్ద పనేమీ కాదు, బరువు తగ్గడం కోసం గుర్రపు స్వారీ, విలు విద్య, కర్రసాములో శిక్షణ తీసుకున్నాను.. అని చెప్పిన కాజల్ బాలయ్య సినిమాపై ఇంట్రెస్టింగ్ గా మాట్లాడింది. ప్రస్తుతం బాలకృష్ణ తో నటించేందుకు సిద్దమవుతున్నట్లుగా కాజల్ చెన్నై మీడియాతో ముచ్చటించింది.

Kajal confirmed the film with Balayya:

Kajal confirmed the film with Balayya NBK108
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs