Advertisement
Google Ads BL

KGFపై తన కామెంట్స్ కరెక్ట్ అంటున్నాడు


KGF సినిమా పేరు తియ్యకుండా ఆ సినిమాపై వెంకటేష్ మహా చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ వైరల్ అవడం అటుంచి.. యశ్ ఫాన్స్ కి, KGF అభిమానులకి కోపం తెప్పించాయి. దానితో వెంకటేష్ మహాపై వారు విరుచుకుపడుతున్నారు. నీకు సినిమా నచ్చకపోయినా.. ఇలా కామెంట్స్ చేస్తావా.. నువ్వు తియ్యి ఇలాంటి సినిమా.. నీకు అంత సీన్ లేదు, ఇన్ సెక్యూర్ లోఫర్ వెంకటేష్ మహా అంటూ అతన్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే నందిని రెడ్డి, వివేక్ ఆత్రేయలు నవ్వడంపై ఫాన్స్ చేస్తున్న ట్రోల్స్ కి భయపడి క్షమాపణ చెప్పారు.

Advertisement
CJ Advs

ఇప్పుడు వెంకటేష్ మహా కూడా తన మాటలను సమర్ధించుకుంటూ తాను మాట్లాడిన భాష తప్పవచ్చేమో అంటూ ఓ వీడియో వదిలాడు. అందులో వెంకటేష్ మహా సారి చెప్పకపోగా.. తాను KGF పై చేసిన కామెంట్స్ ని సమర్ధించుకుంటూ.. తన అభిప్రాయం కరెక్ట్ అని చాలామంది అన్నారు. కొంతమందికి KGF నచ్చలేదని చెప్పారు. నేను వాళ్ళు చెప్పిన మాటలనే నా వాయిస్ ద్వారా వినిపించాను. మీరు మాట్లాడింది కరెక్ట్ అని చాలామంది నాకు మెసేజెస్ చేసారు. నేను సినిమాలోని కల్పిత పాత్రలనే విమర్శించాను, కానీ నేను వాడిన పద భాష కరెక్ట్ కాదు.. అందుకు మాత్రమే క్షమాపణ అన్నాడు.

నేను కల్పిత పాత్రని మత్రమే విమర్శించాను. కానీ రియల్ పర్సన్ నన్ను ఈ విధంగా దూషించడం ఎంతవరకు కరెక్ట్. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుగా దూషిస్తున్నారు. అసభ్యంగా మాట్లాడుతున్నారు. నాకు ఇదేమి కొత్తకాదు, ఇలాంటివి చాలాసార్లు ఫేస్ చేశాను.. మీరందరూ అన్నిరకాల సినిమాలని ఒకేలా ఆదరిస్తారని ఆశిస్తున్నాము అంటూ ఆ వీడియోలో చెప్పాడు. ఇంత జరిగినా వెంకటేష్ మహా ఎక్కడా తగ్గకుండా తాను మాట్లాడింది కరెక్ట్, తన భాష కరెక్ట్ కాదనడం అతన్ని మరింత చిక్కుల్లో పడేసేలా కనబడుతుంది.

He says his comments on KGF are correct:

Venkatesh Maha apologises for remarks on KGF 2
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs