Advertisement
Google Ads BL

సూపర్బ్ శ్రీ లీల.. హ్యాట్స్ ఆఫ్ టు యు


ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ హీరోయిన్ కి లేని డిమాండ్ ధమాకా పాప శ్రీలీలకి ఉంది. వరస ప్రాజెక్ట్స్ అంటే ఒకటి రెండు కాదు.. ఏకంగా ఏడెనిమిది ప్రాజెక్ట్స్ తో శ్రీలీల బిజీ షెడ్యూల్ చూస్తే మిగతా హీరోయిన్స్ కి దిమ్మ తిరగాల్సిందే. ఒకప్పుడు కృతి శెట్టి ఎలా అయితే టాలీవుడ్ యంగ్ హీరోల సరసన సినిమాలు చేసిందో.. అదే మాదిరి ఇప్పుడు శ్రీలీల టాలీవుడ్ యంగ్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా మారింది. రెండు సినిమాలతోనే సూపర్ స్టార్ మహేష్ తోనూ, నందమూరి బాలకృష్ణ సినిమాల్లో ఛాన్స్ కొట్టేసి అందరిని ఆశ్చర్య పరిచింది. రామ్, వరుణ్ తేజ్, నితిన్, వైష్ణవ తేజ్ సినిమాల్లో కనిపించనున్న ఆమె ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలోనూ హీరోయిన్ అంటున్నారు.

Advertisement
CJ Advs

డాక్టర్ చదువుతున్న శ్రీలీల యాక్టర్ గా వెలిగిపోతూనే.. ఇతర మంచి కార్యక్రమాల్లోను తన మంచి మనసుని చూపిస్తుంది. వీకెండ్ సమయాలను ఆస్వాదిస్తూ ఏ వెకేషన్స్ కో చెక్కెయ్యకుండా శ్రీలీల వీకెండ్ సమయాల్లో అనాధాశ్రమానికి వెళ్లి అక్కడ అనాధ పిల్లలతో కలిసి సందడి చేసింది. గొప్ప మనసులున్న చిన్నారులను కలిశాను. గొప్ప కలలున్న సమాజం వీళ్లు. వాళ్లతో కలిసి డాన్సులు, కథలు చెప్పుకోవటం వంటి కార్య‌క్ర‌మాల‌తో ఈ రోజంతా చాల హ్యాపీగా ఉన్నాను. నా ప్రేమ‌ను వీరికి పంచాల‌నే ఉద్దేశంతో ఇక్క‌డ‌కు వ‌చ్చాను. వారి అమాయ‌క చూపుల్లో త‌డిసి ముద్ద‌య్యాను. ఇలాంటి కోరిక చాలామందికి ఉంటుంది. అలాంటి ప‌నులు చేయాల‌ని అంద‌రికీ ఉంటుంది. అయితే ఎలా చేయాలి? ఏం చేయాల‌నేది తెలియ‌క పోవ‌చ్చు.

నేను వాళ్ళకి విరాళాలు ఇవ్వమని చెప్పడం లేదు, కాసేపు వాళ్లతో సమయం గడపండి, మీకు ఆనందం కలుగుతుంది. వాళ్ళ కోసం గూగుల్ లో సెర్చ్ చెయ్యండి, మీ చుట్టుపక్కలే చాలామంది ఉంటారు. మీ విలువైన స‌మ‌యంలో కొంత వారికి కేటాయించండి. వాళ్లు కోరుకునేది అదే. వారానికో, నెల‌కో వారికి స‌మ‌యాన్ని కేటాయించండి. అలాంటి మ‌న‌సుతోనే నేను #HereForYou కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టాను.. అంటూ శ్రీలీల ఆ పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో.. శ్రీలీల మంచి మనసుకి అందరూ ఫిదా అవుతున్నారు.

Sree Leela steals hearts:

Sreeleela comes with Here For You Challenge
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs