పూనమ్ కౌర్ ఏం చేసినా సంచలనమే. ఆమె సోషల్ మీడియాలో ట్వీట్ చేసినా.. దానికి విపరీతార్థాలు తీస్తుంటారు నెటిజన్లు. మంచి అందం, అభినయం ఉన్నా కూడా హీరోయిన్‌గా ఆమె నిలబడలేకపోయింది. అందులోనూ ఇండస్ట్రీలో నిలబడాలంటే చాలా చాలా వదులుకోవాలి. ఆ విషయం ఆమెకూ తెలుసు. ఇండస్ట్రీలోని ఓ వ్యక్తి తన కెరీర్‌ని నాశనం చేశాడంటూ పబ్లిగ్గానే పలుమార్లు ఆమె వాపోయింది. ఇప్పటికీ అవకాశం వచ్చిన ప్రతిసారి ఆ వ్యక్తిని సోషల్ మీడియాలో పెడుతుంటుంది. సినీ ఇండస్ట్రీకి చెందిన ఆ వ్యక్తి ఎవరనేది.. చాలా మందికి తెలుసు కూడా. అయినా పేరు చెప్పకుండా ఇన్ డైరెక్ట్‌గా పంచులు పేలుస్తూనే ఉంటుంది. సినీ కెరీర్ పరంగా ఇలాంటి పరిస్థితులు ఫేస్ చేస్తున్న పూనమ్.. మరో రకంగానూ వేదనకు గురవుతోంది. ఆ విషయాన్ని తాజాగా రాజ్ భవన్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో ఆమె వెల్లడిస్తూ కంటతడి పెట్టుకుంది.
ఆ విషయం ఏదో కాదు.. తను పుట్టి పెరిగింది తెలంగాణ రాష్ట్రమే అయినా.. తనొక పంజాబీలా అంతా చూస్తున్నారని, సొంత రాష్ట్రం నుంచి తనని వెలివేస్తున్నారన్నట్లుగా పూనమ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. దయచేసి అలా చూడవద్దంటూ వేడుకుంది. ప్రస్తుతం ఈ వేడుకల్లో ఆమె ఇచ్చిన స్పీచ్ హైలెట్ అవుతోంది. ఆమె మాట్లాడుతున్న వీడియోలు సోషల్ మీడియా హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి. ఇంతకీ పూనమ్ కౌర్ ఏమందంటే..
‘‘నేను తెలంగాణ రాష్ట్రానికి చెందిన అమ్మాయిని. నేను ఇక్కడే పుట్టాను.. ఇక్కడే పెరిగాను. నా మతాన్ని చూపించి.. నన్ను పంజాబీ అంటూ వేరు చేసి మాట్లాడుతున్నారు. నేను మీ అందరిలానే తెలంగాణ బిడ్డని. దయచేసి మైనారిటీ అని, సిక్కు అని.. నన్ను వేరు చేసి చూడవద్దని ఈ సందర్భంగా అందరినీ వేడుకుంటున్నాను’’ అంటూ స్టేజ్‌పైనే ఏడ్చేసింది. కాగా.. ఈ వేడుకకు సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఖుష్బూతో పాటు వివిధ రంగాలకు చెందిన మహిళామణులు హాజరయ్యారు.