కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా పాన్ ఇండియా ప్రేక్షకుల అభిమానం చూరగొనడమే కాదు.. నిర్మాతలకు 1200 కోట్లు కొల్లగొట్టి లాభాలు తెచ్చిపెట్టి.. బాక్సాఫీసు సునామిని సృష్టించిన KGF రెండు భాగాలు విమర్శకులను సైతం మెప్పించింది. అలాంటి KGF పై తెలుగు దర్శకుడు బహిరంగంగా సంచలన వ్యాఖ్యలు చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా ఓ ఇంటర్వ్యూలో KGF పేరు ఎత్తకుండానే KGF ని ఇండైరెక్ట్ గా ఏకి పారేసాడు.
100, 1000 కోట్ల సినిమాలన్నీ జస్ట్ పాప్ కార్న్ తింటూ చూసే మూవీస్ మాత్రమే. ఆ సినిమాలలో ఏదైనా సీన్ మిస్ అయినా పర్లేదు.. అయ్యో మిస్ అయ్యాము అన్న భావనే ఉండదు. ఆ సినిమాలు ఓటిటి లో చూసేవి. కానీ మేము తీసే సినిమాలు అలాంటివికావు, అలా 1000 కోట్ల మూవీ గురించి చెప్తాను కానీ.. ఆ సినిమా పేరు చెప్పను, వివరాలు చెప్పను. ఆ సినిమాలో ఓ తల్లి కొడుకుని గొప్పవాడివి అవ్వాలిరా, రాజుగా చచ్చిపోవాలి అంటుంది. అంటే బాగా సంపాదించి నలుగురికి ఉపయోపగపడమని ఆవిడ చెబుతుంది.
తల్లి కావాలన్న ఆ వస్తువు తవ్వే వాళ్ళ దగ్గరకి వెళ్లి వాళ్ళని ఉద్ధరిస్తాడు. ఆ హీరో ఆ బంగారాన్ని ఎక్కడో పారేస్తాడు. ఇంతకన్నా పిచ్చోడు ఎవరైనా ఉంటారా.. ఆ మహాతల్లి గనక నిజంగా ఉంటే కలవాలనుంది. అలాంటి కథలు సినిమాలుగా చేస్తే మనం చప్పట్లు కొడుతున్నాం.. అంటూ వెంకటేష్ మహా వెటకారంగా మాట్లాడిన మాటలు హీరో యశ్ ఫాన్స్ నే కాదు.. KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఫాన్స్ ని కూడా ఆగ్రహానికి గురి చేసాయి.