Advertisement
Google Ads BL

ప్రేమే గెలిచింది: మంచు మనోజ్ కామెంట్స్


మంచు మనోజ్ ప్రణతి రెడ్డిని ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు. కానీ వివాహబంధంలో వచ్చిన విభేదాలు.. విడాకులకు కారణమవగా.. మంచు మనోజ్ రెండో పెళ్లి కూడా ప్రేమ వివాహమే కావడం గమనార్హం. అయితే మనోజ్ మౌనిక రెడ్డిని ప్రేమించాడు. కానీ మంచు ఫ్యామిలీ నుండి ఈప్రేమకి వ్యతిరేఖత అంటూ మొదటి నుండి ప్రచారం జరుగుతుంది. మంచు మనోజ్ ఓ పిల్లాడి తల్లిని ప్రేమించడం మోహన్ బాబుకి ఇష్టం లేని కారణంగానే మంచు మనోజ్ అక్క ఇంట్లో పెళ్లి చేసుకున్నాడు, మోహన్ బాబు ఒప్పుకోకపోవడం వలనే పెళ్లి కూడా మనోజ్ లేట్ గా చేసుకున్నాడు, లేదంటే గత ఏడాదే మనోజ్ పెళ్లి జరగాల్సింది అంటూ ఏవేవో ప్రచారాలు వినిపించాయి.

Advertisement
CJ Advs

అయితే గత శుక్రవారం మౌనికని ప్రేమ వివాహం చేసుకున్న మంచు మనోజ్ నిన్న కర్నూలు కి వెళ్లి అక్కడినుండి ఆళ్లగడ్డలో అత్తారింట్లో కాలు పెట్టాడు. ఇక మౌనిక రెడ్డి కొడుకుని తన కొడుకుగా స్వీకరించిన మంచు మనోజ్ ఈ రోజు విఐపి బ్రేక్ దర్శనంలో తిరుమల వేంకటేశ్వరుని దర్శనం చేసుకున్నాడు. అక్క లక్ష్మి, బావ, భార్య మౌనికతో కలసి మంచు మనోజ్ శ్రీవారి దర్శనం చేసుకున్నాడు. తర్వాత మీడియా తో మాట్లాడిన మంచు మనోజ్ ప్రేమపై సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు.

నా భార్య మౌనికతో శ్రీవారి దర్శనం చేసుకోవడం సంతోషంగా ఉంది. మా ప్రేమ గెలిచింది, ప్రేమే గెలిచింది. మీకు తెలుసు మౌనికని నేను వివాహం చేసుకున్నాను, మా తండ్రిగారు ఆశీస్సులు, అక్క సపోర్ట్, అత్తమామల ఆశీస్సులు ఉన్నంతవరకు మమ్మల్ని ఎవ్వరూ ఏమి చెయ్యలేరు అంటూ మనోజ్ ప్రేమపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

అయితే మంచు మనోజ్-మౌనిక ప్రేమ విషయంలో తన తండ్రి మోహన్ బాబు అన్న మంచు విష్ణు తో కలిసి ఏమైనా ఫైట్ చేసాడేమో.. అందుకే ఇలా మాట్లాడాడు అంటూ చాలామంది భావిస్తున్నారు.

Love wins: Manchu Manoj comments:

Manchu Manoj & Bhuma Mounika visited Tirumala Tirupati Devasthana
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs