Advertisement
Google Ads BL

మీనా 40 ఇయర్స్ వేడుకల్లో సూపర్ స్టార్


నటి మీనా చిన్నవయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మనవరాలు, కూతురు పాత్రలతో తన ప్రత్యేకతని చూపించి.. తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. ఇప్పటికీ  సినీ కెరీర్ లో బిజీ లైఫ్ ని లీడ్ చేస్తుంది. గత ఏడాది ప్రేమించి పెళ్లాడిన భర్త విద్యా సాగర్ ని అనారోగ్య కారణాలతో పోగొట్టుకున్న మీనా ఆ బాధనుండి కోలుకుని మళ్ళీ షూటింగ్స్ లో బిజీ అయ్యింది. తన కూతురు కెరీర్ బావుండాలంటే తాను కష్టపడాలని చెప్పిన మీనా సినిమా జీవితం ఆరంభించి 40 ఏళ్ళు అయిన సందర్భంగా చెన్నైలో మీనా 40 ఇయర్స్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Advertisement
CJ Advs

గత రాత్రి నిర్వహించిన ఈ వేడుకలకి సూపర్ స్టార్ రజినీకాంత్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. రజినీకాంత్ తో మీనా హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అలాగే రోజా దంపతులు మీనా 40 ఇయర్స్ సెలెబ్రేషన్స్ లో పాల్గొనడమే కాదు.. వారిద్దరూ మీనాని శాలువా కప్పి సత్కరించారు. అలాగే నటి దేవయాని, ఇంకా శ్రీదేవి, నాజర్, రాధికా శరత్ కుమార్, రుక్మిణి, సంఘవి తదితరులు ఈవేడుకకి హాజరు కాగా.. ఈ సెలెబ్రేషన్స్ లో మీనా కూతురు హైలెట్ గా నిలిచింది. మీనా 40 ఏళ్ళ కెరీర్ ని తారలు ఇలా సెలెబ్రేట్ చేసి ఆమెకి విషెస్ తెలియజేసారు.

అయితే మీనా 40  ఇయర్స్ సెలెబ్రేషన్స్ లో తెలుగు తారలెవరూ కనిపించలేదు. కేవలం రోజా తప్ప. ఇక్కడ మీనా ఎన్నో సూపర్ చిట్ చిత్రాల్లో యాక్ట్ చేసింది. మెగాస్టార్ చిరు, బాలకృష్ణ, వెంకటేష్.. ఇలా స్టార్ హీరోలందరితో నటించింది. మరి ఇక్కడ తెలుగులో కూడా మీనాకి ఏమైనా సన్మానం ఏర్పాటు చేస్తారేమో చూడాలి.

Rajinikanth attends Meena 40 years celebrations:

Meena 40 years Celebration
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs