మాస్ మహారాజ్ రవితేజని మోసం చేశాను అంటూ ఓ నిర్మాత చెప్పడం అందరిలో ఆశ్చర్యాన్ని కలిగించింది. కమెడియన్ నుండి నిర్మాతగా మారి.. నిర్మాత నుండి పాలిటిక్స్ వైపు జంప్ చేసి.. ప్రస్తుతం అటు కమెడియన్ గాను, ఇటు నిర్మాతగానూ యాక్టీవ్ గా లేకపోవడమే కాదు, మరోవైపు పాలిటిక్స్ నుండి బయటకి వచ్చేసి సోషల్ మీడియాలో బిజీగా ఉంటున్న బండ్ల గణేష్ రవితేజని మోసం చేసినట్లుగా చెప్పడం షాక్ కాక ఇంకేమవుతుంది.
బండ్ల గణేష్.. రవితేజని ఓ విషయంలో మోసం చేశాం, అది కూడా ఓ ల్యాండ్ విషయంలో రవితేజని మోసం చేశాను, అది తెలిసిన రవితేజ నన్నేమి అనలేదు అంటూ అసలు స్టోరీ చెప్పుకొచ్చాడు. రవితేజ కి నేను నా పొలం అమ్మాను, అతను కూడా ఎంతో ఇష్టపడి ఆ ల్యాండ్ కొనుక్కున్నాడు. ఆ పొలం కింద నాకు ఇంకో 30 ఎకరాల పొలం ఉంది. అయితే రవితేజకి అమ్మిన పొలం, నా పొలం కలిపి ఒక బిట్టుగా అమ్మితేనే కొంటా అంటూ ఓ వ్యక్తి ప్రపోజల్ పెట్టాడు. సరే ఎక్కువ రేటు వస్తుంది అని.. రవితేజ దగ్గరకి వెళ్లి అబద్దం ఆడాను.
ఆ ప్రాంతంలో ప్రభుత్వం భూ సేకరణ చేస్తుంది.. నాతో పాటుగా నీ పొలం కూడా అమ్మడం బెటర్ అని చెప్పా. దానితో నా మాటలు నమ్మి రవితేజ ఆ ల్యాండ్ సేల్ చేశాడు. ఆ రోజు అలా అబద్దం చెప్పినందుకు చాలా బాధపడ్డా. రవితేజతో సినిమా చేస్తే నాకు 5 కోట్లు మిగిలాయ్. అయినా అలాంటి వ్యక్తిని మోసం చేసినందుకు చాలా ఫీల్ అయ్యా. ఏదో ఒక రోజు అతడి రుణం తీర్చుకుంటా.
ఒకరోజు రవితేజ దగ్గరకి వెళ్లి నిన్ను మోసం చేశా అన్నా అని చెప్పా. నాకు తెలుసురా.. అంటూ నన్ను ఏమి అనకుండా వదిలేశాడు.. అంటూ బండ్ల గణేష్ రవితేజని ఎలా మోసం చేసాడో చెప్పుకొచ్చాడు.