మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకుంటున్నట్లుగా ఎప్పుడూ ఎక్కాడా మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కేవలం మౌనికతో కలిసి చెట్టాపట్టాలేసుని తిరుగుతూ ఆ విషయాన్ని మీడియానే అర్ధం చేసుకునేలా చేసాడు కానీ.. మౌనిక తో పెళ్లి విషయమే స్పందించలేదు. పెళ్లి రోజున పెళ్లి కూతురు అంటూ భూమా మౌనిక పిక్ తో కాబోయే భార్యని పరిచయం చేసాడు. పెళ్లి తరవాత అక్క మంచు లక్ష్మికి జీవితాంతం రుణపడి ఉంటాను అంటూ ఎమోషనల్ గా స్పందించాడు.
పెళ్లి తర్వాత భార్య మౌనికని తీసుకుని మంచు మనోజ్ మొదటిసారి కర్నూల్ వెళ్ళాడు. భారీ కాన్వాయ్ తో భార్య మౌనికతో కలిసి కర్నూల్ అడుగుపెట్టిన మనోజ్ అక్కడ మౌనిక తల్లి శోభా నాగిరెడ్డి తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డి ఆశీస్సులు అందుకుని.. అక్కడి నుండి వారు మౌనిక తల్లితండ్రుల ఘాట్ వద్దకు వెళ్లి నివాళుర్పించాల్సి ఉంది. కర్నూల్ లో మనోజ్ మొదటిసారి మౌనికతో వివాహమై మీడియాతో మాట్లాడాడు.
మీ అందరి ఆశీస్సులతో మౌనికతో నా వివాహం జరిగింది. కర్నూలు నుండి ఆళ్లగడ్డ, కడప ఆ తర్వాత తిరుపతి వెళతాము. మీ అందరి సపోర్ట్ ఎల్లప్పుడూ ఇలానే ఉంటుంది అని కోరుకుంటున్నాను అంటూ మంచు మనోజ్ మౌనికతో పెళ్లిపై మొదటిసారి స్పందించాడు.