Advertisement
Google Ads BL

షణ్ముఖ్-సిరిలపై జెస్సి సెన్సేషనల్ కామెంట్స్


బిగ్ బాస్ సీజన్ 5లో యూట్యూబర్ షణ్ముఖ్, అలాగే సిరిలు ఫ్రెండ్స్ అనేకన్నా వారిద్దరూ లవర్స్ అన్నట్టుగా హౌస్ లో ప్రవర్తించిన తీరుకి నెటిజెన్స్ మండిపడ్డారు. వాళ్ళిద్దరికీ బయట విడివిడిగా లవర్స్ ఉన్నారు. షణ్ముఖ్ కి దీప్తి సునయన, సిరికి శ్రీహన్. కానీ షణ్ముఖ్-సిరిల స్నేహం అదుపుతప్పడంతో వారు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యారు. ఇక హౌస్ లో షణ్ముఖ్-సిరిలు మరో కంటెస్టెంట్ జెస్సితో బాగానే ఫ్రెండ్ షిప్ చేసారు. వీరు ముగ్గురే గుంపుగా కూర్చుని మట్లాడుకునేవారు, వేరే ఎవ్వరితో మాట్లాడేవారు కాదు, అయితే జెస్సి కి అనారోగ్య కారణాలతో హౌస్ నుండి వెళ్లిపోగా.. బిగ్ బాస్ సీజన్ ముగిసాక సిరి-షణ్ముఖ్ ఎలా ఉన్నా జెస్సి కి మాత్రం దూరమయ్యారు, షణ్ముఖ్ అయితే ఏకంగా అతని గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయని కోల్పోయాడు. సిరిది కూడా శ్రీహన్ తో బ్రేకప్ అయినంత పనయ్యింది. 

Advertisement
CJ Advs

అయితే షణ్ముఖ్-సిరి లు కూడా దూరంగానే ఉంటున్నారు. జెస్సిని అయితే బాగా దూరం పెట్టేశారంటూ అతను తాజాగా షణ్ముఖ్-సిరిలపై సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. నాకు బాగా క్లోజ్ అనుకున్నవాళ్ళకి ఐ లవ్ యు చెబుతాను, సిరి, షణ్ముఖ్ పేర్లు తియ్యకుండా వారు అలా అనుకోరు. చెప్పుడు మాటలు విని నాకు దూరమయ్యారు. చాలా బాధగా అనిపించింది. ఒక్కసారి స్ట్రాంగ్ గా ఏర్పడిన ఫ్రెండ్ షిప్ అంత త్వరగా ముగిసిపోదు. నాకు ఫోన్ చేసి వాళ్ళు అలా అన్నారు ఇది నిజమేనా అడిగే స్వాతంత్య్రం వారికి ఉంది. కానీ వాళ్ళు అలా లేరు. నేను తప్పు చేశాను అంటే ఖచ్చితంగా ఒప్పుకుంటాను. అసలు వాళ్ళకి ఒకటి అర్ధం కావడం లేదు.

వీళ్ళని ఒక్కప్పుడు ఛీ.. తూ.. అన్నవాళ్ళ దగ్గరకే వాళ్ళు వెళుతున్నారు. నేను ఫెమస్ అవ్వడానికి వాళ్ళని వాడుకుంటున్నట్లుగా ప్రొజెక్ట్ అయ్యింది. నాకా అవసరం లేదు. అయినా షణ్ముఖ్ అంత పిచ్చోడు కాదు, తనకి ఫేక్ అనిపిస్తే ఎవ్వరిని దగ్గరకి రానివ్వడు. నేను ఫేక్ కాదని తెలిసే, హౌస్ లో నాతో ఫ్రెండ్ షిప్ చేసాడు. నా కోసం ఏడ్చాడు. నేను హౌస్ లో జైలుకెళ్ళినప్పుడు నా కోసం నిలబడతా అన్నాడు. అలాంటి వాళ్ళు ఇప్పుడు నా ఫోన్ కూడా ఎత్తడం లేదు, కట్ చేస్తున్నారు. అలా ఎందుకు మారారో అర్ధం కావడం లేదు. అంతేకాదు షణ్ముఖ్ సోషల్ మీడియాలో నన్ను అన్ ఫాలో కొట్టాడు. దానితో నెటిజెన్స్ నన్నే తిట్టారు. 

సరే నేను నచ్చలేదేమో అనుకుని.. వాడితో కలిసేందుకు ప్రయత్నం చేశాను, వన్ ఇయర్ వెయిట్ చేశాను.. కానీ కలవలేదు.. నాకూ కోపం వచ్చింది. నన్ను కాదనుకుంటున్న వాళ్ళ కోసం నేను ఎందుకు వాళ్ళ వెనుక తిరగాలని దూరంగా ఉండిపోయానంటూ జెస్సి షణ్ముఖ్, సిరిలు తనతో ప్రవర్తిస్తున్న తీరుని బయటపెట్టాడు.

Jessie Sensational Comments on Shanmukh-Siri:

Jessie Shocking Comments On Siri And Shanmukh behavior
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs