మంచు మనోజ్-మౌనిక రెడ్డిల వివాహం శుక్రవారం రాత్రి మంచు లక్ష్మి ఇంట్లో అంగరంగ వైభవంగా జరిగిపోయింది. మంచు మోహన్ బాబు, మంచు విష్ణులు సతి సమేతులుగా మనోజ్ ని-మౌనికలని ఆశీర్వదించారు. ఇంకా కొద్దిమంది సెలబ్రిటీస్ ఈ పెళ్లి వేడుకల్లో భాగమయ్యారు. దర్శకులు గోపీచంద్ మలినేని, హీరోలు సిద్దు జొన్నలగడ్డ, తేజా సజ్జ, సింగర్ సునీతా, నిక్కీ గల్రాని ఇలా కొద్దిమంది సెలబ్రిటీస్ హాజరైన ఈ పెళ్ళిలో మౌనికారెడ్డి కొడుకు ధైరవ్ స్పెషల్ గా కనిపించాడు. ఇక నిన్న శనివారం మౌనిక కొడుకు బాధ్యతలు తీసుకోవడం శివాజ్ఞ అంటూ మనోజ్ మౌనిక కొడుకు చేతులని తన చేతుల్లోకి తీసుకుంటూ ప్రమాణం చేసిన పిక్ షేర్ చేసాడు.
పెళ్లి తరవాత మంచు మనోజ్-మౌనిక రెడ్డిలు మొదటిసారి కర్నూల్ వెళ్ళడానికి రెడీ అయ్యారు. మౌనిక వైట్ డ్రెస్ లో మెరిసిపోగా.. మనోజ్ కూడా వైట్ షర్ట్ లో అందంగా భార్య చెయ్యికిపట్టుకుని ఇంటి నుండి బయటికి వస్తున్న పిక్స్ సోషల్ ఇండియాలో వైరల్ అయ్యాయి. ఇక కర్నూలులో మొదటగా మనోజ్-మౌనికలు SV సుబ్బారెడ్డి గారి ఇంటికి వెళ్లి తర్వాత అక్కడి నుండి భూమా నాగి రెడ్డి, శోభా నాగి రెడ్డి ల ఘాట్ లని సందర్శిస్తారని మనోజ్ పీఆర్ టీం మంచు మనోజ్-మౌనిక ల కర్నూల్ షెడ్యూల్ ని ప్రకటించింది.
పెళ్లి తర్వాత మనోజ్-మౌనికలని అలా చూసిన మంచు అభిమానులు ముచ్చటపడిపోతూ కొత్త జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.