మంచు మనోజ్ సెకండ్ మ్యారేజ్ మోహన్ బాబుకి ఇష్టం లేదు.. అందుకే ఆయన మనోజ్ పెళ్లి వేడుకలకి దూరంగా ఉన్నారు. కానీ పెళ్లి సమయానికి బాగోదు గనక పెళ్లి కి హాజరై మనోజ్-మౌనిక రెడ్డిని ఆశీర్వదించారంటూ జోరుగా ప్రచారం లో ఉన్న న్యూస్. మౌనిక కి మొదటి భర్తతో విడాకులు కావడం, ఆమెకి ఓ కొడుకు ఉండడం ఇవన్నీ మోహన్ బాబుకి నచ్చకపోవడంతోనే ఆయన ఈ పెళ్లి విషయంలో దూరంగా ఉన్నారనే టాక్ నడిచింది.
అయితే మనోజ్ పెళ్లిని కూడా మోహన్ బాబు తన ఇంట్లో చెయ్యకుండా సైలెంట్ గా ఉండడంతో, మంచు లక్ష్మి తమ్ముడి పెళ్లి బాధ్యతలు తీసుకుంది. ఇక లక్ష్మి ఇంట్లో పెళ్లి జరిగే సమయానికి మోహన్ బాబు వెళ్లి వధూవరులని ఆశీర్వదించారు. అలా ఆశీర్వదిస్తున్న సమయంలో మౌనిక రెడ్డి మోహన్ బాబుని హత్తుకుని కన్నీటి పర్యంతమైంది. మోహన్ బాబు కూడా మౌనికని ఓదారుస్తూ ఆమెని హత్తుకున్న పిక్ ని మంచు లక్ష్మి సోషల్ మీడియాలో షేర్ చేసింది. And they lived happily ever after💞 @manojkmanchu @bhumamounika #MWedsM #ManojWedsMounika ఆ పిక్ తో పాటుగా ఇలా క్యాప్షన్ పెట్టింది.
నిజంగా ఆ పిక్ చూస్తే మోహన్ బాబుకి ఈ పెళ్లి అంటే కోపమని ఎవరనగలరు, అంత ప్రేమగా కోడలికి భరోసా ఇచ్చిన ఆయనకి మనోజ్ పెళ్లి నచ్చకపోవడమా అనే కామెంట్స్ చేస్తున్నారు.