Advertisement
Google Ads BL

సందీప్ వంగా సినిమాపై అల్లు అర్జున్ కామెంట్స్


నిన్న శుక్రవారం ఉదయం ఉన్నట్టుండి బాలీవుడ్ టీ సీరిస్ నిర్మాతలు టాలీవుడ్ క్రేజీ  డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా-అల్లు అర్జున్ కలయికలో మూవీని ఎనౌన్స్ చేసి అందరికి షాకిచ్చారు. టి సీరీస్ నిర్మాతలతో కలిసి సందీప్ రెడ్డి-అల్లు అర్జున్ ఫొటోలకి ఫోజులిచ్చిన ఫొటోస్ షేర్ చెయ్యగానే అందరిలో ఓ పక్క ఆశ్చర్యం, మరోపక్క ఈ కాంబో పై అంచనాలు, అల్లు ఫాన్స్ లో ఆనందం ఇలా ఉంది నిన్నటినుండి వాతావరణం. అర్జున్ రెడ్డి తో కల్ట్ మాసివ్ మూవీతో మెప్పించి, అదే అర్జున్ రెడ్డిని బాలీవుడ్ లో రీమేక్ చేసి అదరగొట్టి.. మరో స్టార్ హీరో రణబీర్ ని డైరెక్ట్ చేస్తూ క్రేజీ స్టార్ డైరెక్టర్ గా మారాడు.

Advertisement
CJ Advs

ఇటు పుష్ప తో పాన్ ఇండియా మూవీ తో నార్త్ ప్రేక్షకులని అలరించిన అల్లు అర్జున్ తో సందీప్ రెడ్డి అనగానే.. అసలు ఈ కాంబో ఎలా సెట్టయ్యింది, ఎవరు కలిపారనే అనుమానాలతో ప్రేక్షకులు తెగ ఆలోచించేస్తున్నారు. ఈ కాంబో ప్రకటించారో లేదో.. ఇలా ఈ ప్రాజెక్ట్ పై అప్పుడే హైప్ క్రియేట్ అయ్యింది. అయితే ఈ చిత్రంపై అల్లు అర్జున్న్ ఏం మాట్లాడలేదు. జస్ట్ ఆ కాంబో సెట్ అయినట్లుగా మేకర్స్ ఇచ్చిన అప్ డేట్ తప్ప. తాజాగా అల్లు అర్జున్ ఈ క్రేజీ  ప్రాజెక్ట్ పై సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఈ కాంబినేషన్ కోసం కొంతకాలంగా ఎదురుచూస్తున్నాను. సందీప్ వంగా మ్యాజిక్ ఏంటో గానీ, ఎక్కడో నన్ను బలంగా తాకింది. మా కాంబినేషన్ లో వచ్చే చిత్రం చాలాకాలం గుర్తుండిపోయేలా ఉంటుందని ఆశిస్తున్నాను.. అంటూ ట్వీట్ చేసాడు.

దానితో ఈ ప్రాజెక్ట్ పై అల్లు అర్జున్ ఎంత ఎగ్జైటింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడో అర్ధమవుతుంది. ఇక ఈ కాంబో ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందో అంటూ అల్లు ఫాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు.

Allu Arjun opens up on working with Sandeep Reddy Vanga:

Allu Arjun on working with Sandeep Reddy Vanga for his next
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs