Advertisement
Google Ads BL

బాలీవుడ్ చుట్టూ తిరిగి ఇప్పుడిలా..


అల్లు అర్జున్ పుష్ప తర్వాత బాలీవుడ్ దర్శకుడితోనే సినిమా చేస్తాడు... అందుకే ముంబై చుట్టూ తిరుగుతున్నాడు. సంజయ్ లీలా భన్సాలీతో అల్లు అర్జున్ రెండుమూడు సార్లు ఆయన ఆఫీస్ కే వెళ్లి మీటవ్వడం చూసిన వారు అల్లు అర్జున్ ఖచ్చితంగా సంజయ్ లీల తోనే సినిమా చేస్తాడని అనుకున్నారు. అంతలా అల్లు అర్జున్ ముంబై చుట్టూ తిరిగాడు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో కనెక్ట్ అయ్యాడు. అస్సలు ఎక్కడా చిన్న గాసిప్ కూడా బయటికి రాకుండా ఈ కాంబోని ఎనౌన్స్ చేసారు.

Advertisement
CJ Advs

సందీప్ రెడ్డి వంగాతో అల్లు అర్జున్ అనగానే అందరిలో ఆశ్చర్యం. వాట్ ఏ కాంబో అంటూ అందరూ నిజంగా షాక్ అయ్యారు. సందీప్ రెడ్డి మాసిజానికి.. అల్లు అర్జున్ మాస్ కటౌట్ కి బాలీవుడ్ బడా నిర్మాతలు తోడైతే  ఇక పూనకాలే అంటూ అల్లు ఫాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. నిజంగా ఎవ్వరూ ఊహించని కాంబో ఇది. సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి తర్వాత మహేష్ చుట్టూ తిరగాడు.. తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ సినిమాలు చేస్తూనే ప్రభాస్ తో సినిమా ప్రకటించి అప్పుడు షాకిచ్చాడు.

స్పిరిట్ ఇంకా పట్టాలెక్కముందే రణబీర్ కపూర్ తో యానిమల్ షూటింగ్ మొదలు పెట్టాడు. అది అలా ఉన్న సమయంలోనే ఎలాంటి హడావిడి లేకుండా అల్లు అర్జున్ తో సినిమా కమిట్ అయ్యాడు. అల్లు అర్జున్ కొత్త సినిమా ప్రకటన రాబోతుంది అనగానే అది సంజయ్ లీలా భన్సాలీదే అంటూ అందరూ అనుకున్నాడు. అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్ట్ విషయం దసరా సమయం నుండి నలుగుతుంది. కానీ ఇప్పుడు కొత్త సినిమాని సందీప్ రెడ్డి వంగాతో ప్రకటించి అల్లు అర్జున్ అందరిని సర్ ప్రైజె చేసాడు.

Now back around Bollywood..:

Allu Arjun Is All Set To Star In Sandeep Reddy Vanga Next
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs