Advertisement
Google Ads BL

అంత పెద్ద స్టార్ కి ఎంత ఘోర అవమానం


ఆర్.ఆర్.ఆర్ తో పాన్ ఇండియా స్టార్ కాక ముందే యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్ హీరో. టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్స్ హిట్స్ కొట్టిన హీరో. ఎన్టీఆర్.. రాజమౌళితో చరణ్ తో కలిసి చేసిన ఆర్.ఆర్.ఆర్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా తెలుగోడి సత్తా చాటుతుంది. అందుకే ఎన్టీఆర్ తో ఒక్క ఫోటో దిగాలన్నా, షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నా ప్రేక్షకులు, అభిమానులు పడి చచ్చిపోతారు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఎన్టీఆర్ క్రేజ్ పెరిగిపోయింది. ఇంటర్నేషనల్ మీడియాలో ఎన్టీఆర్ పేరు మార్మోగిపోతోంది. అంత పెద్ద స్టార్ కి ఇంత ఘోర అవమానమా అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ మండిపడడం కాదు.. మధనపడుతున్నారు.

Advertisement
CJ Advs

కారణం నందమూరి కుటుంబంలో ఎన్టీఆర్ కి ఉన్న విలువ చూసి వారు బాధపడుతున్నారు. నందమూరి కుటుంబానికి ఎన్టీఆర్ కి చాలా దూరం అని తెలుసు. కానీ మధ్యలో ఎన్టీఆర్ తో కుటుంబం మొత్తం కలిసిపోయింది. ఆయనకి చంద్రబాబు చేతుల మీదుగా పెళ్లి జరిగింది. టీడీపీకి ఎన్టీఆర్ ప్రచారం చేసాడు. అంతా బాగానే ఉంది. కానీ తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ కి నందమూరి ఫ్యామిలీకి దూరం ఏర్పడింది. అది ఎంత దూరమనేది తారకరత్న మరణంతో అందరికి అర్ధమైంది. తారకరత్నని బెంగుళూరు చూసిరావడానికి వెళ్ళింది మొదలు బాలకృష్ణ ఎన్టీఆర్ ని పెద్ద కర్మవరకు ఎలా ట్రీట్ చేసారో.. చూసిన ఎన్టీఆర్ ఫాన్స్ తట్టుకోలేకపోతున్నారు.

రాజకీయ బద్ద శత్రువు విజయ సాయి రెడ్డి తో కూడా మాట్లాడి మర్యాదలు చేసిన బాలయ్య తారకరత్న పెద్ద కర్మ రోజున ఎన్టీఆర్ ని అవాయిడ్ చెయ్యడం, అసలు నందనమూరి ఫ్యామిలిలో చాలామంది ఎన్టీఆర్ ని పలకరించకపోవడం చూసిన ఫాన్స్ బాధని దిగమింగుతున్నారు. కేవలం కళ్యాణ్ రామ్ అక్క సుహాసిని, ఇంకా ఎన్టీఆర్ పెద్ద మేనత్త, వారి పిల్లలే ఎన్టీఆర్ ని పలకరించారు.. మిగతా ఎవ్వరూ ఎన్టీఆర్ ని పలకరించలేదు.

ఎన్టీఆర్ తో ఉన్నందుకు కళ్యాణ్ రామ్ ని ఫ్యామిలీ ఆ విధంగానే ట్రీట్ చేసింది. బాలయ్య కూడా కళ్యాణ్ రామ్ ని అవాయిడ్ చెయ్యడం నందమూరి అభిమానులు అస్సలు తట్టుకోలేకపోతున్నారు. ఎన్టీఆర్ తో ఫొటోస్ కోసం, ఆయన చెయ్యి తాకడానికి ఎంతోమంది ఎగబడుతుంటే.. ఆయన్ని ఫ్యామిలీ అంత దూరంగా పెట్టడం మాములు సినిమా ప్రేక్షకులకి నచ్చలేదు. హరికృష్ణ అన్న బ్రతికుంటే ఇలా ఉండేది కాదుగా అంటూ మాట్లాడుతున్నారు. ప్రస్తుతం తెలుగు వారంతా.. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోని వారంతా అదే మాట్లాడుతున్నారు.

What a shame for such a big star:

Balakrishna and Nandamuri family avoid NTR and KalyanRam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs