Advertisement
Google Ads BL

పెళ్లి కూతురిని పరిచయం చేసిన మంచు మనోజ్


మంచు మనోజ్ మొదటి భార్య ప్రణతికి డివోర్స్ ఇచ్చి,. భూమా మౌనికని రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని మీడియా సంస్థలు గుక్కతిప్పకుండా న్యూస్ లు రాసినా.. మంచు మనోజ్ కానీ, మంచు ఫ్యామిలీ కానీ ఈ విషయాన్ని ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. మనోజ్-మౌనికలు రెండో పెళ్లి కి రెడీ అయ్యి ముహుర్తాలు పెట్టించిన విషయం ప్రకటించలేదు. మార్చ్ 3 అంటే ఈ రోజు రాత్రి మనోజ్ వివాహం మౌనికతో జరగబోతుంది. అది కూడా ఫిల్మ్ నగర్ లోని మంచు లక్ష్మి ఇంట్లో మనోజ్ పెళ్లి వేడుకలు, పెళ్ళికి సంబందించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

Advertisement
CJ Advs

మంచు మోహన్ బాబుకి మనోజ్ సెకండ్ మ్యారేజ్ ఇష్టం లేదనే ప్రచారమూ గట్టిగానే జరుగుతుంది. అందుకే మనోజ్ పెళ్లి లక్ష్మి ఇంట్లో జరుగుతుంది అంటున్నారు. అదలాఉంటే మనోజ్ తనకి కాబోయే భార్యని ఎప్పుడెప్పుడు పరిచయం చేస్తాడా అని ఆయన అభిమానులు చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. గత రెండు రోజులుగా మెహిందీ, సంగీత్ సెలెబ్రేషన్స్ జరుగుతున్నా మంచు మనోజ్ ఎలాంటి పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేయకపోవడంతో అభిమానులు, నెటిజెన్స్ బాగా డిస్పాయింట్ అవుతున్నారు. 

ఈరోజు శుక్రవారం రాత్రి 8.30 నిమిషాలకి పెళ్లి పీటలెక్కనున్న మంచు మనోజ్ తనకి కాబోయే భార్యని పిక్ తో సహా పరిచయం చేసాడు. Pellikuthuru @bhumamounika ❤️#MWedsM #ManojWedsMounika 🙏🏼❤️అంటూ మౌనిక రెడ్డి పెళ్లి కూతురుగా ముస్తాబైన ఫోటోని షేర్ చెయ్యగా.. మనోజ్ కి అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Manchu Manoj introduced the bride Mounika:

Manchu Manoj Wedding: Groom Introduces His Pellikuthuru Bhuma Mounika
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs