Advertisement
Google Ads BL

బాలయ్య: తారకరత్నతో అలా-ఎన్టీఆర్ తో ఇలా


తారకరత్న మరణంతో నందమూరి అభిమానులు ఎంతో బాధలో ఉన్నారు. తారకరత్న మరణాన్ని జీర్ణించుకోవడానికి వాళ్ళకి చాలా సమయమే పట్టింది. ఆయన తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయి అప్పుడే 14 రోజులు గడిచిపోయాయి. ఈ గురువారం తారకరత్న పెద్ద కర్మ హైదరాబాద్ FNCC లో కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయప్రముఖుల మధ్యన జరిగింది. తారకరత్న తండ్రి మోహన్ కృష్ణ చేతుల మీదుగా కార్యక్రమాలు పూర్తి కాగా.. బాబాయ్ బాలయ్య, మామగారు విజయ్ సాయి రెడ్డి చేతుల మీదుగా తారకరత్నకు మిగతా కార్యక్రమాలు జరిపించారు. అయితే బాలకృష్ణ తారకరత్న విషయంలో వ్యవహరించిన తీరు నందమూరి అభిమానుల గుండెలు పిండేసింది. తారకరత్న ఆసుపత్రి పాలైనప్పటినుండి ఆయన మరణించి, అంత్యక్రియలు, చిన్న కర్మ, పెద్ద కర్మ జరిగేవరకు బాలయ్య చూపించిన ప్రేమకి నందమూరి అభిమానులు ఫిదా అయిపోయారు.

Advertisement
CJ Advs

తారకరత్నతో అంత ప్రేమగా ఉండి, ఆయనకు జరగాల్సిన కార్యక్రమాలను దగ్గరుండి చూసిన బాలయ్య తన మరో అన్న హరికృష్ణ గారి కొడుకు ఎన్టీఆర్ తో వ్యవహరించిన తీరు నందమూరి అభిమానులు గుండె పగిలేలా చేసింది. ఎన్టీఆర్ తో బాలకృష్ణ ఎప్పుడూ సఖ్యతతో ఉండరు. నందమూరి ఫ్యామిలీ మొత్తం ఎన్టీఆర్ ని ద్వేషిస్తుంది. ఆయన తల్లిని పట్టించుకోదు. ఎన్టీఆర్ ఎంత పెద్ద స్టార్ అయినా కుటుంబం విషయంలో చాలా అవమానపడతూ ఉంటాడు. తాజాగా తారకరత్న మరణంలో ఆ విషయం స్పష్టంగా అర్ధమైంది. బాలయ్య ఎన్టీఆర్ ని ఎంతగా పట్టించుకోరో.. నిన్న తారకరత్న పెద్ద కర్మలో చూసే ఉంటారు. ఎన్టీఆర్ తారకరత్న ఫోటో దగ్గర పూలు వేసి నమస్కరిస్తున్న సమయంలో బాలయ్య అక్కడే ఉండి.. ఎవరితోనో మాట కలిపారు కానీ ఎన్టీఆర్ ని పట్టించుకోలేదు.

అది సరే.. ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ వచ్చి వెనుక వరసలో కూర్చున్నారు.. బాలయ్య అందరిని పలకరించుకుంటూ వెళుతుండగా.. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు మర్యాదపూర్వకంగా లేచి నించున్నారు. బాలయ్య అప్పటివరకు అందరిని పలకరించి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అక్కడే ఉన్నా.. మాట్లాడకుండా వెళ్లిపోయిన వీడియో చూసి నందనమూరి  అభిమానులు గుండెపగిలేంతగా బాధపడుతున్నారు. ఇంత జరిగినా నువ్వు మారవా బాలయ్యా అంటున్నారు

తారకరత్నతో అంత బాగా ఉన్న బాలయ్య, ఎన్టీఆర్ తో ఎందుకింత మొండిగా ఉంటారు. ఆ వీడియో చూసిన ఫాన్స్ మాత్రమే కాదు. ప్రతి ఒక్కరూ ఎంతో బాధపడుతూ.. అయ్యో ఎన్టీఆర్ తో ఇకపై బాలయ్య మాట్లాడారా అని చర్చించేసుకుంటున్నారు.

Balayya Ignored NTR :

Balayya Ignored Jr NTR and Turned his Head
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs