యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాన్స్ ఆందోళన ఒక్కదాని కోసం కాదు. ఒకపక్క NTR30 పై వారు మధనపడుతున్నారు. అదెప్పుడు మొదలవుతుంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ అంటే ఎలా ఉండాలి, ఏప్రిల్ 4 న రిలీజ్ అన్నారు. ఇంకా గట్టిగా చూస్తే ఏడాది సమయం లేదు. షూటింగ్ లేట్ అయితే విడుదల తేదీ కూడా మారిపోతుంది అని NTR30 ఓపెనింగ్ కోసం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఇంటర్నేషనల్ గా ఎక్స్పోజ్ అవ్వాల్సిన ఎన్టీఆర్ ఇలా ఇంట్లో కూర్చోవడం వారిని మరింత ఆందోళనకి గురి చేస్తుంది. పాన్ ఇండియా స్టార్ అయ్యాక నేషనల్, ఇంటర్నేషనల్ మీడియా కన్ను తమపై ఉండేలా చూసుకోవలసింది.
అక్కడ రామ్ చరణ్ విపరీతంగా మీడియాలో హైలైటవుతుంటే.. ఎన్టీఆర్ కూడా.. ఉండాల్సిన చోట లేకపోవడం ఆయన ఫాన్స్ ని ఆందోళనకి గురి చేస్తుంది. ఇప్పుడు గనక ఎన్టీఆర్ అమెరికాలో ఆస్కార్ అవార్డులకు హాజరైతే ఎన్టీఆర్ పై అందరి చూపు పడేది. ఆటోమాటిక్ గా పాన్ వరల్డ్ లో హైప్ క్రియేట్ అయ్యేది. కానీ ఎన్టీఆర్ అమెరికాకి వెళ్ళలేదు. ఆర్.ఆర్.ఆర్ ప్రతి ఈవెంట్ లో కనిపించిన ఎన్టీఆర్ ఇప్పుడు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసిషియన్ అవార్డులకు, ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ కి వెళ్ళకపోవడం ఎన్టీఆర్ ఫాన్స్ లో ఆందోళనకి కారణమయ్యింది.
అదే అక్కడికి వెళ్లి వచ్చాక NTR30 ఓపెనింగ్ అంటే హాలీవుడ్ మీడియాలో కూడా పబ్లిసిటీ వచ్చేది అని వారు ఫీలవుతున్నారు. కానీ ఇప్పుడు అలా జరగదు. మనం గొంతెత్తి అరిస్తే తప్ప అది హాలీవుడ్ కి రిజిస్టర్ అవ్వదు. అదే అక్కడికి వెళితే ఆటోమాటిక్ గా ఫ్రీగా కావాల్సినంత క్రేజ్, పబ్లిసిటీ వచ్చేసేదని వారి అభిప్రాయం.