Advertisement
Google Ads BL

చిక్కుల్లో షారుఖ్ భార్య గౌరీ ఖాన్


రెండేళ్ల క్రితం షారుఖ్ ఖాన్ ఆయన భార్య గౌరీ ఖాన్ లు కొడుకు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవడంతో చాలా మధనపడిపోయారు. కొడుకుకి బెయిల్ వచ్చేవరకు నిద్రాహారాలు మానేసి.. పూజలు చేసిన గౌరీ ఖాన్ తర్వాత కొడుకు ఆ కేసు నుండి బయటపడడంతో ఊపిరి పీల్చుకుని ప్రస్తుతం తన పని తాను చేసుకుంటున్నారు. భర్తతో కలిసి గ్లామర్ గా రెడీ అయ్యి బాలీవుడ్ వేడుకలకి హాజరయ్యే గౌరీ ఖాన్ ఇంటీరియర్ డిజైనర్. ఆమె తన ఇంటిని కూడా తన ఆధ్వర్యంలోనే అదిరిపోయే ఇంటీరియర్ తో అలంకరించుకుంది. 

Advertisement
CJ Advs

అయితే తాజాగా గౌరీ ఖాన్ చిక్కుల్లో పడింది. లక్నోలో ఆమెపై కేసు నమోదు అయ్యింది. నాన్ బెయిలబుల్ సెక్షన్ 409 కింద ఆమెపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ముంబైకి చెందిన జస్వంత్ షా అనే వ్యక్తి గౌరీఖాన్ పై కేసు పెట్టాడు. గౌరీ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ గా పని చేసిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ లక్నోలోని సుశాంత్ గోల్ఫ్ సిటీ ప్రాంతంలోని తులసియాని గోల్ఫ్ వ్యూలో తనకు కేటాయించిన ఫ్లాట్‌ను వేరొకరికి ఇచ్చారని, తన దగ్గరనుండి 86 లక్షలు వసూలు చేసినప్పటికీ తనకు ఫ్లాట్‌ను కేటాయించలేదని.. అతను ఆ సంస్థ పై అలాగే దానికి ప్రచార కర్తగా పని చేసిన గౌరీ ఖాన్ పై ఫిర్యాదు చేసాడు. 

బ్రాండ్ అంబాసిడర్ గౌరీ ఖాన్ ఉండడంతోనే తాను ఆ ఫ్లాట్ కొన్నానని సుశాంత్ తన ఫిర్యాదులో చెప్పగా.. గౌరీ ఖాన్, అనిల్ కుమార్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసారు పోలీస్ లు.

Shahrukh wife Gauri Khan is in trouble:

Shah Rukh Khan Wife Gauri Khan In Legal Trouble
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs