మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికా లో ఆర్.ఆర్.ఆర్ కొల్లగొడుతున్న అవార్డుల వేడుకల్లో సందడి చేస్తున్నారు. ఆయన అవుట్ ఫిట్స్, రామ్ చరణ్ స్టయిల్స్, అన్ని ఇంటర్నేషనల్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి. రామ్ చరణ్ అంతర్జాతీయ మీడియాలో హల్ చల్ చేస్తుండడం మెగా ఫాన్స్ కి కిక్ ఇస్తుంది. అయితే రామ్ చరణ్ ఆస్కార్ అవార్డ్స్ వేడుక కోసం అక్కడే అమెరికాలో ఉండిపోయారు. అక్కడ ఆయన మీడియాతో పర్సనల్ విషయాల దగ్గరనుండి ప్రొఫెషనల్ విషయాల వరకు పంచుకుంటున్నారు. అందులో భాగంగానే రామ్ చరణ్ తన ఫెవరెట్ మూవీస్ పై అక్కడి మీడియాలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.
తనకిష్టమైన సినిమాల్లో మొదటి స్థానంలో హాలీవుడ్ మూవీస్ ది నోట్ బుక్, రెండోస్థానంలో టెర్మినేటర్ 2 ఉంటాయి.. ఒక్కో సినిమాని 50 సార్లు చూసి ఉంటాను, అందులో ప్రతి సన్నివేశం అద్భుతమే, ముఖ్యంగా ఎమోషన్స్ ఆకట్టుకుంటాయని చెప్పారు చరణ్. ఆ తర్వాత స్థానంలో కూడా హాలీవుడ్ మూవీస్ ఉంటాయి.. గ్లాడియేటర్ , డైరెక్టర్ టరంటినో వంటి సినిమాలు తనకి బాగా నచ్చే సినిమాలు, వాటిని కూడా ఎన్నిసార్లు చూశానో గుర్తు లేదని చెప్పారు. మంచి కంటెంట్ తో వచ్చే సినిమాలని ఒకటికి రెండుసార్లు చూస్తాని చెప్పారు చరణ్.
బాలీవుడ్ లో మిస్టర్ ఇండియా దర్శకుడు శేఖర్ కపూర్ తెరకెక్కించిన సినిమాలు కూడా తనకి బాగా నచ్చుతాయని చెప్పిన చరణ్ సౌత్ లో సీనియర్ ఎన్టీఆర్ దన వీర శూర కర్ణ, బాహుబలి, అలాగే తాను నటించిన రంగస్థలం చిత్రాలు తనకి ఇష్టమని.. ఇలా రామ్ చరణ్ తనకిష్టమైన సినిమాల లిస్ట్ ని హాలీవుడ్ మీడియాలో బయటపెట్టారు.