కోలీవుడ్ నటుడు సూర్య వరస విజయాలతో, వరస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోవడమే కాదు.. తన ఓన్ బ్యానర్ లో సినిమాలను నిర్మిస్తూ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న నటుడు. అయితే సూర్య బాలీవుడ్ లో ఆకాశం నీ హద్దురా చిత్రాన్ని రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. సూర్య ఈ మధ్యన తన ఫ్యామిలీతో కలిసి ఉండడటం లేదు, తన తండ్రి శివ కుమార్ తో సూర్య కి విభేదాల కారణంగా సూర్య తన భార్య జ్యోతిక తన పిల్లలతో కలిసి వేరుగా ఉంటున్నాడనే ఓ న్యూస్ కోలీవుడ్ మీడియా సర్కిల్స్ లో వినిపిస్తుంది.
సూర్య ఆయన తండ్రి శివ కుమార్, కార్తీ వీళ్లంతా చెన్నై లో ఒకే చోట కలిసి ఉంటారు. వీరు ముగ్గురూ కలిసి సేవా కార్యక్రమాలే కాదు.. చాలా విషయాల్లో కలిసి కనిపిస్తారు. కానీ ఇప్పుడు జ్యోతిక వలనే సూర్యకి, తండ్రికి మధ్యన విభేదాలు వచ్చాయంటూ తమిళ నటుడు బైల్వాన్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చెయ్యడం హాట్ టాపిక్ అవుతుంది. జ్యోతికని సూర్య ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు సూర్య తండ్రి ఈ పెళ్లిని అంగీకరించలేదని, తర్వాత కొడుకు కోసం ఒప్పుకున్నా జ్యోతిక పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పి ఇంటి బాధ్యతలు చూసుకోవాలంటూ ఆయన కండిషన్ పెట్టారని, అయితే జ్యోతిక గత కొట్టిరోజులుగా సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వడమే కాకుండా.. ఆమె కూడా వరసగా సినిమాలు చేస్తుంది.
ఇది నచ్చని శివ కుమార్ కి సూర్య కి మధ్యన మనస్పర్థలు తలెత్తాయని, దానితో సూర్య భార్య జ్యోతిక కోసమే తండ్రికి, తమ్ముడు కార్తీకి దూరంగా భార్య పిల్లని తీసుకుని ముంబై వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారంటూ ఆ నటుడు సంచలనంగా మాట్లాడాడు. అయితే ఇందులో నిజమెంతుంతో.. ఇది నిజామా? లేదంటే గాలి వార్తా? అనేది తెలియాల్సి ఉంది.