కోలీవుడ్ గ్లామర్ డాల్ మాళవిక మోహనన్ నటించిన సినిమాల గురించి మాట్లాడుకోవాలంటే.. ఆమె అంతగా మెప్పించి నటించేసి పేరు తెచ్చుకున్న సినిమాలేవీ లేవు. స్టార్ హీరోల సినిమాల్లో నటించినా.. మాళవిక మోహన్ కి అద్భుతమైన రోల్స్ రాలేదు. జస్ట్ హీరోయిన్ పాత్ర ఉండాలి, అందుకు ఓ హీరోయిన్ కలవాలి అనే పాత్రలే ఆమెకి తగిలాయి. అయితే సినిమాల పరంగా హైలెట్ కానీ.. మాళవిక మోహన్ గ్లామర్ పరంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ హైలెట్ అవుతూనే ఉంది.
సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు వెనుకాడని మాళవిక మోహన్ శారీ కట్టినా.. ఏ డ్రెస్ వేసినా మోడరన్ గా అందాలు చూపించేస్తుంది. అది చాలలేదేమో.. ఆమె పేరు సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని.. లేడీ సూపర్ నయనతారపై ఇండైరెక్ట్ కామెంట్స్ తో షో చేసి నయన్ అభిమానులకి చిక్కి చేతులు కాల్చుకుంది. చివరికి లేడీ సూపర్ స్టార్ ఫాన్స్ కి సారి చెప్పింది. తాజాగా మాళవిక మోహన్ మలయాళంలో నటించిన సినిమా విడుదలైంది.
ఆ ఊపులోనే సోషల్ మీడియాలో గ్లామర్ పిక్స్ పోస్ట్ చెయ్యగా వాటిని చూసిన యూత్.. మాళవిక మోహన్ అందం మైమరిపిస్తోంది గురూ.. అంటూ మాట్లాడుకుంటున్నారు.