Advertisement
Google Ads BL

శ్రీలీలకి రౌడీ హీరో ఆఫర్?


శ్రీలీల జోరుకి మిగతా హీరోయిన్లు బేజారు అన్నట్టుగా అమ్మడుకి అవకాశాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే శ్రీలీల ఇంటి ముందు దర్శకనిర్మాతలు టెంట్ వేసుకుని మరీ ఆమెని తమ సినిమాల్లో బుక్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు కృతి శెట్టి లానే ఇప్పుడు శ్రీలీల బిజీ తారగా మారిపోయింది. ఇంకా కృతి శెట్టి కి ఉప్పెన బ్లాక్ బస్టర్ ఉంది. కానీ శ్రీలీల కి పెళ్లి సందD ప్లాప్. అయినా హీరోలు వెనక్కి తగ్గడం లేదు. శ్రీలీల డాన్స్ కి హీరోలే కాదు.. ఆడియన్స్ కూడా ఫిదా అవ్వడంతో.. ఆమెకి ఇంత డిమాండ్ పెరిగింగి. వరుణ్ తేజ్, నితిన్, బాలయ్య, అలాగే రామ్ తో పాన్ ఇండియా మూవీస్ లో నటిస్తున్న శ్రీలీల కి మరో రెండు ప్రాజెక్ట్ లు ఫైనల్ అయ్యేలా ఉన్నాయి.

Advertisement
CJ Advs

ఇప్పుడు విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో శ్రీలీల పేరు వినిపిస్తుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ ఖుషి చిత్రంలో సమంత తో రొమాన్స్ చేస్తున్నాడు. ఆయన తదుపరి మూవీ గౌతమ్ తిన్ననూరితో రీసెంట్ గానే మొదలు పెట్టాడు. ఇందులో పోలీస్ యూనిఫామ్‌లో ఓ వ్య‌క్తి ముఖానికి ముసుగు ధ‌రించి ఉండ‌టం, అలాగే నేను ఎక్క‌డివాడినో, ఎవ‌రిని మోసం చేశానో తెలియ‌దు అంటూ ఈమధ్యనే ఫస్ట్ లుక్ రివీల్ చేసారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన శ్రీలీల పేరుని పరిశీలిస్తున్నారట మేకర్స్. ఇది తెలిసిన రౌడీ ఫాన్స్ బిగ్ స్క్రీన్‌పై విజయ్ - శ్రీలీల జోడీ చూడముచ్చటగా ఉంటుందని హ్యాపీగా ఫీలవుతున్నారు.

ఇక శ్రీలీల హీరోయిన్ గా ఫైనల్ చేసి.. మేకర్స్ అధికారిక ప్రకటన కూడా ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. నిజంగా శ్రీలీల కి రౌడీ హీరో సరసన అవకాశం దక్కితే అమెంత లక్కీ హీరోయిన్ మరొకరు ఉండరు. 

Sreeleela to romance Vijay Deverakonda?:

Sree leela to romance Vijay Deverakonda in Gautam Tinnanuri film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs